Ys Sharmila: మోదీతో హాట్‌లైన్ లేదని బైబిల్ మీద ప్రమాణం చేయగలరా? జగన్ కు షర్మిల సవాల్..
జగన్ కి సభ్యత సంస్కారం లేవని నిన్నటి వ్యాఖ్యలతో అర్ధమైపోయిందన్నారు. మోదీకి జగన్ దత్త పుత్రుడు అని షర్మిల విమర్శించారు. (Ys Sharmila)

Ys Sharmila: మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి ద్వారా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో హాట్ లైన్ ఉంది అంటూ జగన్ చేసిన ఆరోపణలను షర్మిల ఖండించారు. జగన్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని షర్మిల విమర్శించారు. అంతేకాదు.. మోదీతో చంద్రబాబుకు కాదు.. జగన్ కే హాట్ లైన్ ఉందంటూ షర్మిల ఎదురుదాడికి దిగారు. మోదీతో హాట్ లైన్ లేదని బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పగలరా? అని జగన్ కు సవాల్ విసిరారు షర్మిల. చంద్రబాబుతో రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీకి ఎలాంటి హాట్ లైన్ లేదని తేల్చి చెప్పారు షర్మిల.
మోదీకి వంగి వంగి నమస్కారం పెట్టి, ఇప్పుడు అసత్యాలు ఎందుకు మాట్లాడుతున్నారని జగన్ పై ధ్వజమెత్తారు షర్మిల. బీజేపీ బిల్లులకు మద్దతిచ్చిన జగన్.. ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విరుచుకుపడ్డారు. జగన్ కి సభ్యత సంస్కారం లేవని నిన్నటి వ్యాఖ్యలతో అర్ధమైపోయిందన్నారు. మోదీకి జగన్ దత్త పుత్రుడు అని షర్మిల విమర్శించారు.
అటు ప్రధాని మోదీ, ఎన్నికల కమిషన్ పై విరుచుకుపడ్డారు షర్మిల. దేశ ప్రజలు స్వచ్చందంగా ఓటు వేసే హక్కును ఈసీ, బీజేపీ కలిసి హరించాయని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ దేశ ప్రజల ఓట్లను దొంగిలించారని ఆమె ఆరోపించారు. ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ బయటపెట్టిన ఆధారాలపై బీజేపీ నోరు విప్పాలన్నారు. రాహుల్ గాంధీ దేశ పౌరుల హక్కుల కోసం కొట్లాడుతున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటం కోసం పోరాటం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
‘తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీకి చంద్రబాబుతో హాట్ లైన్ రిలేషన్ ఉందని జగన్ చేసిన కామెంట్స్ హాస్యాస్పదం. మోదీతో జగన్ కి హాట్ లైన్ రిలేషన్ ఉంది. జగన్ నీతి మాలిన రాజకీయాలు చేశారు కాబట్టే ప్రజలు ఓడించారు. రాహుల్ గాంధీకి, చంద్రబాబుకి ఏ హాట్ లైన్ రిలేషన్ లేదు. మోదీతో ఏ హాట్ లైన్ లోనూ రిలేషన్ లేదని బైబిల్ మీద ప్రమాణం చేసి జగన్ చెప్పాలి” అని షర్మిల ఛాలెంజ్ చేశారు.
మోదీ మెడలు వంచుతా అన్నారు.. వంగి వంగి దండాలు పెట్టారు..
”ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తోంది. అలాంటి రాహుల్ కి చంద్రబాబుతో ఒక హాట్ లైన్ ఉంది అనటం దారుణం. పచ్చ కామెర్లు కమ్మిన వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. నిజానికి మోదీతో జగన్ కి హాట్ లైన్ ఉంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోదీతో ఒక హాట్ లైన్ మెయింటైన్ చేస్తూనే వచ్చారు జగన్. నీతిమాలిన రాజకీయాలు చేశారు, తెర వెనుక పొత్తు పెట్టుకున్నారు. మిగతా వారు కూడా ఇలానే చేస్తారని జగన్ అనుకుంటున్నారు. చంద్రబాబుతో రాహుల్ కి ఏ హాట్ లైన్ లేదని చాలా కచ్చితంగా చెప్పగలము. మీకు మోదీ, అమిత్ షాలతో హాట్ లైన్ లేదని బైబిల్ మీద ప్రమాణం చేసి హామీ ఇవ్వగలరా? మీరు ఇవ్వలేరు. (Ys Sharmila)
మోదీ మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తానని అధికారంలోకి వచ్చిన మీరు.. అదే మోదీకి మెడలు వంచి ఎన్నోసార్లు కాళ్లకు దండాలు పెట్టారు. ఏ బిల్లుకి కావాలంటే ఆ బిల్లుకి సంబంధించి బీజేపీకి మద్దతిచ్చారు. ఎన్నో ప్రాజెక్టులను మోదీ మనుషులకు కట్టబెట్టారు. మోదీ మనుషులు, బీజేపీ వాళ్లకు పదవులు కూడా ఇచ్చారు జగన్. మరి హాట్ లైన్ ఉన్నది ఎవరికి? మోదీ, అమిత్ షాలతో మీకు హాట్ లైన్ లేదా? దీన్ని హాట్ లైన్ అనరా?” అంటూ జగన్ పై విరుచుకుపడ్డారు షర్మిల.
Also Read: జగన్ అడ్డాలో వైసీపీకి షాక్.. రెండు చోట్ల టీడీపీ విజయభేరి.. 30 ఏళ్ల తర్వాత పులివెందులలో గెలుపు..