తవ్వకాల్లో బయటపడిన 2వేల ఏళ్లనాటి మమ్మీ నోట్లో బంగారపు నాలుక..!షాక్ అయిన పురావస్తుశాస్త్రవేత్తలు..!!

తవ్వకాల్లో బయటపడిన 2వేల ఏళ్లనాటి మమ్మీ నోట్లో బంగారపు నాలుక..!షాక్ అయిన పురావస్తుశాస్త్రవేత్తలు..!!

Golden toungue in egypt mummy : పురావస్తుశాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపి ఎన్నో విషయాలను వెలుగులోకి తెస్తుంటారు. ఈ తవ్వకాల్లో ఎన్నో వింతలు, విశేషాలు బయటపడుతుంటాయి. అటువంటి ఓ వింత ఈజిప్టులో జరిగింది. ఈజిప్టు అంటే ఠక్కున గుర్తుకొచ్చేవి ‘మమ్మీ’లు. అలా తవ్వకాలు జరుపుతున్న పురావస్తుశాస్త్రవేత్తలు జరుపుతున్న తవ్వకాల్లో 2వేల ఏళ్లనాటి ఓ మమ్మీ బైటపడింది. ఇది పెద్ద వింతా కాదు విశేషం కాదు..కానీ ఆ మమ్మీ నోట్లో ఓ ‘బంగారపు నాలుక’ ఉంది. అదే వింత. ఆ మమ్మీ నోట్లో ‘బంగారపు నాలుక’చూసిన పురావస్తుశాస్త్రవేత్తలు షాక్ అయ్యారు…!!

ఈజిప్టులోని తపోసిరిస్ మగ్నా ప్రాంతంలో పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరుపుతుండగా..2000 ఏళ్ల నాటి ఓ మమ్మీ బయటపడింది. ఆ మమ్మీ నోట్లో ‘బంగారు నాలుక’ ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ అరుదైన ఘటనపై ఈజిప్టు పురావస్తు, పర్యాటక శాఖ స్పందిస్తూ..ఈ వ్యక్తి చనిపోయినపుడు అతడిని మమ్మీగా మార్చే సమయంలో ఈ నాలుకను అతడి నోటిపై ఉంచి ఉంటారని, అది కాలక్రమేణా అలా నోట్లోకి జారిపోయి ఉంటుందని తెలిపింది.

కాగా.. మరణం తరువాత కచ్చితంగా ఆ వ్యక్తికి మరో జీవితం ఉంటుందని నమ్మేవారు. బహుశా దానివల్లే ఆ జీవితంలో కూడా ఈ వ్యక్తి మాట్లాడాలనే ఉద్దేశంతోనే ఈ బంగారు నాలుకను అక్కడ ఉంచి ఉంటారు’ అని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కాగా నోట్లో బంగారు నాలుకతో ఉన్న మమ్మీతో పలు ఇంకా కొన్ని మమ్మీలు ఈ తవ్వకాల్లో బైటపడ్డాయి.