GPS Car : OMG.. ప్రాణాల మీదకు తెచ్చిన GPS, సముద్రంలోకి దూసుళ్లిన కారు.. షాకింగ్ వీడియో

GPS Car: అన్ని సందర్భాల్లో వీటిని గుడ్డిగా నమ్ముకోవడం, వాటి మీద ఆధారపడటం అంత మంచిది కాదు. వాటి కారణంగా ఒక్కోసారి ప్రమాదాల బారిన పడొచ్చు. మన ప్రాణాలకే ప్రమాదం ఏర్పడొచ్చు.

GPS Car : OMG.. ప్రాణాల మీదకు తెచ్చిన GPS, సముద్రంలోకి దూసుళ్లిన కారు.. షాకింగ్ వీడియో

GPS Car(Photo : Google)

GPS Car : ఈ రోజుల్లో జనాలంతా గూగుల్ మ్యాప్స్, జీపీఎస్ మీదే ఆధారపడుతున్నారు. ఏదైనా కొత్త ప్లేస్ కి వెళ్లాలంటే వీటి మీదే డిపెండ్ అవుతున్నారు. ఎవరినీ అడగాల్సిన పనే లేదు. పైగా, అవైతే చాలా కచ్చితంగా పని చేస్తాయని, గమ్య స్థానాలకు చేరుస్తాయని నమ్మకం. అయితే, అన్ని సందర్భాల్లో వీటిని గుడ్డిగా నమ్ముకోవడం, వాటి మీద ఆధారపడటం అంత మంచిది కాదు. వాటి కారణంగా ఒక్కోసారి ప్రమాదాల బారిన పడొచ్చు. మన ప్రాణాలకే ప్రమాదం ఏర్పడొచ్చు. తాజాగా, జీపీఎస్ ను నమ్ముకుని కారుని నడిపిన ఓ మహిళ ఊహించని ప్రమాదంలో చిక్కుకుంది. కారు ఏకంగా సముద్రంలోకి దూసుకెళ్లింది.

ఈ షాకింగ్ ఘటన అమెరికాలోని హవాయిలో జరిగింది. జీపీఎస్ ఆన్ చేసుకుని కారు నడిపిన టూరిస్టులు ఆ కారును ఏకంగా సముద్రంలోకి తీసుకెళ్లారు. ఓ కుటుంబం హవాయికి వచ్చింది. అక్కడ సముద్రంలో విహరించింది. ఆ తర్వాత ఇద్దరు మహిళలు కారులో బయలుదేరారు. ఒక మహిళ జీపీఎస్ సాయంతో కారును డ్రైవ్ చేసింది. అయితే రాంగ్ డైరెక్షన్స్ కారణంగా.. కారుని నేరుగా సముద్రంలోకి తీసుకెళ్లింది. అంతే, కారు నీళ్లలో పడింది.(GPS Car)

Also Read..Bengaluru Techie : అద్దె ఇల్లు కోసం గూగుల్‌లో సెర్చ్ చేసి రూ. 1.6 లక్షలు కోల్పోయిన బెంగళూరు టెక్కీ.. అసలేం జరిగిందంటే?

కారు నీళ్లలో మునగడం స్టార్ట్ అయ్యింది. ఇంతలో అక్కడే ఉన్న బోటు సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. కారులో ఉన్న ఇద్దరు మహిళలను తాళ్ల సాయంతో రక్షించారు. ఆ తర్వాత కారు నీటిలో మునిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ద్యావుడా.. జీపీఎస్ ఎంత పని చేసింది అని అంతా షాక్ అవుతున్నారు. ఇద్దరు మహిళలు ప్రాణాలతో బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఏ మాత్రం తేడా జరిగినా.. కారుతో సహా ఆ ఇద్దరు కూడా నీటిలో మునిగి జలసమాధి అయ్యేవారని నెటిజన్లు అంటున్నారు.

Also Read..Madhya Pradesh: వీడియో చూస్తే షాక్ అవుతారు.. సామాన్యుల చేతిలో తుపాకులు, కుటుంబాల గొడవలో ఆరుగురిని కాల్చి చంపారు

హార్బర్ లో ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారు ఎక్కిన ఆ ఇద్దరు మహిళలు. హార్బర్‌లో మాంటా రే స్నార్కెల్ టూర్ కంపెనీని కనుగొనడానికి ప్రయత్నించారు. ఇందుకోసం జీపీఎస్ మీద డిపెండ్ అయ్యారు. అది కాస్తా బెడిసికొట్టింది. జీపీఎస్ సూచనలను ఆనుసరించి కారు డ్రైవ్ చేయగా.. అది కాస్తా సముద్రంలోకి వెళ్లింది. ఆ ఇద్దరు మహిళల అదృష్టం చాలా బాగుంది. వెంటనే బోటు సిబ్బంది అలర్ట్ కావడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఏ మాత్రం ఆలస్యమైనా ఘోరాతి ఘోరం జరిగిపోయి ఉండేది.

 

View this post on Instagram

 

A post shared by Christie H (@thehutchess)