Madhya Pradesh: వీడియో చూస్తే షాక్ అవుతారు.. సామాన్యుల చేతిలో తుపాకులు, కుటుంబాల గొడవలో ఆరుగురిని కాల్చి చంపారు

కుటుంబలవారు గొడవపడుతున్న సమయంలోనే ఇద్దరు వ్యక్తులు తుపాకులు తీసి కాల్పులు జరిపారు. ముగ్గురు మహిళలు సహా ఇరు వర్గాలకు చెందిన ఆరుగురు మృతి చెందారు. ఈ వివాదంలో తొలుత కర్రలతో దాడి చేసుకున్నారని, అనంతరం ఒక వర్గం వారు తుపాకులు తీసి కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Madhya Pradesh: వీడియో చూస్తే షాక్ అవుతారు.. సామాన్యుల చేతిలో తుపాకులు, కుటుంబాల గొడవలో ఆరుగురిని కాల్చి చంపారు

Madhya Pradesh: బిహార్, ఉత్తప్రదేశ్ వంటి రాష్ట్రంలో గన్ కల్చర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ రెండు రాష్ట్రాలే కాకుండా మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో కూడా ఈ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇది అప్పుడెప్పుడో చల్లబడిపోయిందనుకుంటే కొంత కాలంగా మళ్లీ చెలరేగినట్టే కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో యువకులు తుపాకులు సమకూర్చుకున్నారు. అంతే కాకుండా, ఏకంగా మీడియా ముందుకే వచ్చి పోలీసుల అదుపులో ఉన్న మాజీ ఎంపీ అయిన మాఫియా డాన్ అతీక్ అహ్మద్‭ను కాల్చి చంపారు.

Karnataka Polls: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో అనూహ్యంగా ‘ది కేరళ స్టోరి’ సినిమాను లేవనెత్తిన ప్రధాని మోదీ

ఇక తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఒక సంఘటన అయితే గన్ కల్చర్ ఏ స్థాయిలో మళ్లీ చెలరేగుతుందో కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. భూవివాదం కారణంగా ఇరు వర్గాల వారికి మధ్య గొడవ జరిగింది. కుటుంబలవారు గొడవపడుతున్న సమయంలోనే ఇద్దరు వ్యక్తులు తుపాకులు తీసి కాల్పులు జరిపారు. ముగ్గురు మహిళలు సహా ఇరు వర్గాలకు చెందిన ఆరుగురు మృతి చెందారు. ఈ వివాదంలో తొలుత కర్రలతో దాడి చేసుకున్నారని, అనంతరం ఒక వర్గం వారు తుపాకులు తీసి కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

కాల్పుల్లో మరణించిన వారు 1. లెస్ కుమారి 2. బాబ్లీ 3. మధు కుమారి 4. గజేంద్ర సింగ్ 5. సత్యప్రకాష్ కుమారుడు 6. సంజు కుమార్. వీరితో పాటు ఈ కాల్పుల్లో గాయపడ్డ ఇద్దరు (వినోద్ సింగ్, వీరేంద్ర) వ్యక్తులు ఆసుపత్రితో మృత్యువుతో పోరాడుతున్నారు. విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు పరిస్థితులు మళ్లీ అదుపు తప్పకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కాగా, ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

BBC anchor mistake : లైవ్‌లో అలెర్ట్‌గా లేకపోతే అంతే.. బీబీసీ యాంకర్ చేసిన చిన్న మిస్టేక్ వైరల్

మొరెనా జిల్లా సిహోనియన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లేపా గ్రామానికి చెందిన రంజిత్ తోమర్, రాధే తోమర్ మధ్య భూమి విషయంలో వివాదం నెలకొంది. 2014లో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి రంజిత్ తోమర్ తరపు వారు రాధే తోమర్ కుటుంబానికి చెందిన ముగ్గురిని హత్య చేశారు. దీని తర్వాత రంజిత్ తోమర్ కుటుంబం గ్రామం విడిచి వెళ్లిపోయింది. రెండ్రోజుల క్రితం గ్రామానికి తిరిగి వచ్చిన అతడు పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతో దాడి చేశాడు. భూవివాదానికి సంబంధించి ఇరువర్గాల మధ్య కర్రలతో భీకర కొట్లాటలు జరిగాయి. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపి ఆరుగునిని చంపారు. దీంతో ఆ గ్రామం తీవ్ర భయాందోళన వాతావరణం పెరిగింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు.