Karnataka Polls: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో అనూహ్యంగా ‘ది కేరళ స్టోరి’ సినిమాను లేవనెత్తిన ప్రధాని మోదీ

నీట్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని మే 6న నిర్వహించ తలపెట్టిన భారీ ర్యాలీ షెడ్యూల్ మార్చారు. రెండు రోజుల పాటు రోడ్ షో నిర్వహించనున్నరు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్‌షోలో ముఖ్య అతిధిగా హాజరు అవుతారు.

Karnataka Polls: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో అనూహ్యంగా ‘ది కేరళ స్టోరి’ సినిమాను లేవనెత్తిన ప్రధాని మోదీ

Karnataka Polls: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ తరపున వన్ మ్యాన్ షోగా దూసుకుపోతున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.. అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా విపక్ష కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. నిన్న బజరంగ్ దళ్ రద్దు అంశాన్ని బజరంగ్ భలిగా మలిచి మంచి మైలేజ్ సాధించిన ఆయన.. తాజాగా ‘ది కేరళ స్టోరీ’ అనే సినిమాపై చెలరేగుతున్న అంశాన్ని లేవనెత్తారు.

kohinoor diamond : కోహినూర్ వజ్రం కనిపించకుండానే కింగ్ చార్లెస్ పట్టాభిషేకం ..!! ఎందుకంటే..

ఈ సినిమాను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ ఉగ్రమూకలకు ఆశ్రయం ఇస్తోందని, ఓటు బ్యాంకు కోసం ఉగ్రవాదాన్ని కాపాడిందంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం బళ్లారిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడుతూ ‘‘ది కేరళ స్టోరీ సినిమా ఉగ్రకుట్ర ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా తీవ్రవాదంలోని దుర్మర్గమైన కోణాన్ని చూపిస్తుంది. ఉగ్రవాదం ఎలా పని చేస్తోందని, వారి రూపకల్పన ఎలా జరుగుతుందనే నిజాన్ని బహిర్గం చేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదంపై తీసిన ఈ సినిమాని వ్యతిరేకిస్తోంది. ఉగ్రధోరణలకు అనుకూలంగా వ్యవహరిస్తోంది. ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ ఉగ్రవాదాన్ని కాపాడింది’’ అని అన్నారు.

కాంగ్రెస్ కార్యాలయం వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత

కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో పూర్తిగా అబద్ధాలతో నిండి ఉందని మోదీ విమర్శించారు. ఇప్పుడు ‘బజరంగ్ బలి’ అని చెప్పడానికి తనతో చెప్పేందుకు కాంగ్రెస్ వారు ఇబ్బంది పడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా, నీట్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని మే 6న నిర్వహించ తలపెట్టిన భారీ ర్యాలీ షెడ్యూల్ మార్చారు. రెండు రోజుల పాటు రోడ్ షో నిర్వహించనున్నరు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్‌షోలో ముఖ్య అతిధిగా హాజరు అవుతారు.