kohinoor diamond : కోహినూర్ వజ్రం కనిపించకుండానే కింగ్ చార్లెస్ పట్టాభిషేకం ..!! ఎందుకంటే..

బ్రిటన్ రాజు చార్లెస్‌ III పట్టాభిషేకం కోహినూర్‌ వజ్రం లేకుండానే పట్టాభిషేకం జరుగనుంది. మరి బ్రిటన్ రాజప్రాసాదం ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది? కోహినూర్ వజ్రం కనిపించకుండానే 70 ఏళ్ల తరువాత తొలిరాజు చార్లెస్ పట్టాభిషేకం ఎందుకు జరుగనుంది? దీని వెనుక కారణమేంటి? ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవటానికి కారణాలేంటి? అనేది చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక ఉన్న ఆ అత్యంత ఆసక్తిగల విషయం ఏమిటంటే..

kohinoor diamond : కోహినూర్ వజ్రం కనిపించకుండానే కింగ్ చార్లెస్ పట్టాభిషేకం ..!! ఎందుకంటే..

kohinoor diamond..queen Camilla

kohinoor diamond : బ్రిటన్ రాజు చార్లెస్‌ III పట్టాభిషేకం కోహినూర్‌ వజ్రం లేకుండానే పట్టాభిషేకం జరుగుతుందా? అంటే అవుననే సమాధానమొస్తోంది. మరి బ్రిటన్ రాజప్రాసాదం ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది. కోహినూర్ వజ్రం కనిపించకుండానే 70 ఏళ్ల తరువాత తొలిరాజు చార్లెస్ పట్టాభిషేకం ఎందుకు జరుగనుంది? దీని వెనుక కారణమేంటి? ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవటానికి కారణాలేంటి? అనేది చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక ఉన్న ఆ అత్యంత ఆసక్తిగల విషయం ఏమిటంటే..

ప్రపంచ ప్రఖ్యాతిగాంచి ఈ కోహినూర్ వజ్రం అంటేనే వివాదాల మయం. భారత్ కు చెందిన ఈ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఈ వజ్రం బ్రిటన్ రాణి కిరీటంలో చేరింది. మా కోహినూర్ ను మాకు తిరిగి ఇచ్చేయాలనే భారత్ డిమాండ్..కానీ దాని గురించి మాత్రం బ్రిటన్ ఏమాత్రం స్పందించదు. సూర్యుడు అస్తమించని సామ్రాజ్యాన్ని నిర్మించిన బ్రిటీషర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో దేశాలకు చెందిన కళాఖండాలను తరలించుకుపోయింది. భారత్ ను 200ల ఏళ్లు పాలించిన బ్రిటీషర్స్ మన దేశానికి చెందిన కోహినూర్ వజ్రాన్ని కూడా సొంతం చేసుకుంది. బ్రిటన్ రాణీ దివంగత క్వీన్ ఎలిజబెత్ తన కిరీటంలో ఈ కోహినూర్ ను అలకరించుకున్నారు. ప్రత్యేక సందర్భంగా క్వీన్ ఎలిజబెత్ ఈ కోహినూర్ వజ్రం ఉన్న కిరీటాన్ని ధరించేవారు. ఆమె మరణం తరువాత ఆమె కుమారుడు చార్లెస్ III బ్రిటన్ రాజుగా పట్టాభిషేకం కానున్నారు. ఈ వేడుక రేపే అంటే మే 6న అంగరంగవైభోగం జరుగనుంది..

King Charles III..Camilla : కింగ్ ఛార్లెస్‌-3, కెమిల్లా 35 ఏళ్ల ప్రేమగాథ .. రాజకిరీటంపై హక్కు కోసం వీరేం చేశారంటే..

ఈ వేడుకల్లో బ్రిటన్ రాజకుటుంబానికే తలమానికంగా ఉన్న క్వీన్ ఎలిజెబెత్ కిరీటంలో మకుటాయమానంగా వెలిగిపోతున్న ‘కోహినూర్ వజ్రం’ గురించి మరోసారి ప్రపంచ వ్యాప్తంగా చర్చల్లోకి వచ్చింది. చార్లెస్ పట్టాభిషేకం సందర్భంగా ప్రపంచం దృష్టి అంతా పట్టాభిషేకం గురించి..చార్లెస్ పట్టాభిషేకంతో పాటు వైభోగం గురించి..ఈ వేడుకలో వినియోగించే కళాఖండాలపైనా..ఏర్పాట్లపైనా..రాజకుటుంబ సంప్రదాలయాలపైనా వచ్చే అతిథుల పైనా ఉంది. కానీ భారత్ దృష్టి వీటన్నింటితో పాటు కోహినూర్ వజ్రంపై ఉంది. క్వీన్ ఎలిజబెత్ రాణి కిరీటంలో ఉండే ఈ కోహినూర్ డైమండ్ మాత్రం ఈ పట్టాభిషేక వేడుకలు కనుమరుగు కానుంది.

ఈ పట్టాభిషేక మహోత్సవాలంలో రాజుగా చార్లస్ తో పాటు రాణిగా కెమిల్లా కూడా కిరీటాన్ని ధరించబోతున్నారు. కోహినూర్‌ వజ్రం లేని కిరీటాన్ని ధరించి పట్టాభిషేక కార్యక్రమంలో రాణి కెమిల్లా పాల్గొనబోతున్నారు..ఈ విషయం అత్యంత ఆసక్తకంగాను హాట్ టాపిక్ గాను మారింది. మే 6 (2023)న అత్యంత అట్టహాసంగా రూ.1000కోట్లకు పైగా ఖర్చుతో నిర్వహించనున్న కింగ్‌ చార్లెస్‌-3 పట్టాభిషేక కార్యక్రమానికి క్వీన్‌ మేరీ కిరీటాన్ని రాణి కెమిల్లా ధరించబోతున్నట్టు తెలిసింది. టవర్‌ ఆఫ్‌ లండన్‌లో ఉన్న క్వీన్‌ మేరీ కిరీటాన్ని పట్టాభిషేక కార్యక్రమానికి సిద్ధం చేయాలని కెమిల్లా నుంచి ఆదేశాలు వెళ్లాయి. క్వీన్‌ ఎలిజబెత్‌-2 గౌరవార్థం ఈ కిరీటాన్ని రాణి కెమిల్లా ధరించబోతున్నట్టు తెలిసింది. కానీ ఈ కిరీటంలో కోహినూర్ వజ్రం లేకుండా కనిపించనుంది. దీనికి కారణం ఏమిటంటే..వివాదాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో రాణి కిరీటంలోంచి ప్రతిష్ఠాత్మక కోహినూర్‌ వజ్రాన్ని ఈసారి తొలగించారట.

Also Read: “బాహుబలి”లో భల్లాలదేవ పట్టాభిషేక మహోత్సవం కంటే అద్భుతంగా కింగ్ ఛార్లెస్-III పట్టాభిషేకం.. 10 అంశాలివిగో