Iran Attacks: మళ్లీ రెచ్చిపోయిన ఇరాన్.. గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ రిఫైనరీలపై భీకర దాడులు
కువైట్, సౌదీ, ఖతార్ పై మరోసారి ఇరాన్ దాడులు చేస్తోంది. వందలాది మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది.
Representative Image (Image Credit To Original Source)
- ఇరాన్ సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ పై ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ ప్రతీకార దాడులు
- కువైట్, సౌదీ, ఖతార్ లోని ఆయిల్ క్షేత్రాలపై మిస్సైళ్లు, డ్రోన్లతో అటాక్స్
- కువైట్ లోని మినా అల్ అహ్మదీ రిఫైనరీపై డ్రోన్ తో దాడి
- ఖతార్ లోని అతిపెద్ద గ్యాస్ క్షేత్రం రాస్ లఫాన్ పైనా మిస్సైళ్లతో దాడి
Iran Attacks: పశ్చిమాసియాలో రోజురోజుకు యుద్ధం తీవ్రమవుతోంది. దాదాపు 20 రోజులుగా దాడులు, ప్రతిదాడులతో మిడిల్ ఈస్ట్ లో బాంబుల మోత మోగుతోంది. గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ రిఫైనరీలపై ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్ కో రిఫైనరీపై డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా, రిఫైనరీ స్వల్పంగా దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు సమాచారం.
యుద్ధ నేపథ్యంలో హర్మూజ్ జల సంధిని ఇరాన్ మూసివేయగా అప్పటి నుంచి సౌదీ అరేబియా, ఎర్ర సముద్రం ద్వారా చమురును రవాణ చేస్తోంది. తాజాగా దీనిపై ఇప్పుడు ఇరాన్ దాడి చేసింది. ఇరాన్ దాడులతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. దీంతో బ్రెంట్ క్రూడాయిల్ ధర 116 డాలర్లకు పెరిగింది. మరోవైపు దక్షిణ లెబనాన్ పై కూడా ఇజ్రాయెల్ దాడులకు తెగబడుతోంది. లెబనాన్ లోని ఆసుపత్రిపై అటాక్ జరిగినట్లు తెలుస్తోంది.
గల్ఫ్ దేశాల్లోని ఇంధన వనరులు టార్గెట్ గా ఇరాన్ దాడులు చేస్తోంది. ఇరాన్ సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. దీనికి ప్రతీకార దాడులు చేస్తోంది ఇరాన్. కువైట్, సౌదీ, ఖతార్ పై మరోసారి ఇరాన్ దాడులు చేస్తోంది. వందలాది మిస్సైళ్లు, డ్రోన్లతో ఇరాన్ అటాక్స్ చేస్తోంది. సౌదీలోని ఆరామ్ కో రిఫైనరీపై ఇరాన్ 4 మిస్సైళ్లతో అటాక్ చేసింది. కువైట్ లోని మినా అల్ అహ్మదీ రిఫైనరీపై డ్రోన్ తో దాడి చేసింది. దీంతో మినా అల్ అహ్మదీ రిఫైనరీలో మంటలు చెలరేగాయి.
దాని పక్కనే ఉన్న మినా అబ్దుల్ రిఫైనరీకి కూడా మంటలు వ్యాపించాయి. ఇక ఖతార్ లోని అతిపెద్ద గ్యాస్ క్షేత్రం రాస్ లఫాన్ పైనా మిస్సైళ్లతో దాడి చేసింది ఇరాన్. ఈ గ్యాస్ క్షేత్రం ప్రపంచంలోనే అతి పెద్దది. ఈ దాడితో ఖతార్ సీరియస్ అయ్యింది. 24 గంటల్లో దేశం విడిచిపోవాలని ఇరాన్ రాయబారులను ఆదేశించింది. గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ రిఫైనరీలపైనే కాదు.. అమెరికా సైనిక స్థావరాలపైనా ఇరాన్ అటాక్స్ చేస్తోంది. ఇజ్రాయెల్ పై జరిపిన క్షిపణి దాడుల్లో వెస్ట్ బ్యాంక్ లో నలుగురు మృతి చెందారు.
