Komatireddy Venkat Reddy: గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం.. హాజరుకాని మంత్రి కోమటిరెడ్డి.. అసలేం జరిగింది
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు పాల్గొన్నారు .
Representative Image (Image Credit To Original Source)
Komatireddy Venkat Reddy: తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం గ్రాండ్‌గా జరిగింది. హైదరాబాద్ హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ ఇందుకు వేదికైంది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ సెలబ్రిటీలు తరలివచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఇంకా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సలహాదారులు, ప్రముఖ సినీ నటులు కమల్ హాసన్, నాగార్జున సైతం తరలి వచ్చారు.
అయితే తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025 కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం హాజరుకాలేదు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాష్ట్రం సినిమాటోగ్రాఫీ మంత్రిగా ఉన్నారు. ఆయన ఈ వేడుకకు గైర్హాజరు అవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గద్దర్ అవార్డుల ప్రదానోత్సవానికి మంత్రి కోమటిరెడ్డి దూరంగా ఉండడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అసలు ఆయన ఎందుకు ఈ ఫంక్షన్ కి రాలేదు? కారణం ఏమై ఉంటుంది? అసలేం జరిగింది? అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఈ వ్యవహారం సినీ, రాజకీయ వర్గాల్లో డిస్కషన్ కు దారితీసింది.
గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో రాజు వెడ్స్ రాంబాయి, ఛాంపియన్ సినిమాలు అత్యధిక పురస్కారాలు పొందాయి. నాగచైతన్యకు (తండేల్) ఉత్తమ నటుడి అవార్డ్ దక్కింది. రష్మిక (ది గర్ల్ ఫ్రెండ్ ) ఉత్తమ నటిగా ఎంపికైంది. మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ దక్కింది. నటుడు కమల్ హాసన్ ను పైడి జయరాజ్, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజను సినారే పురస్కారాలు వరించాయి.
