BBC anchor mistake : లైవ్‌లో అలెర్ట్‌గా లేకపోతే అంతే.. బీబీసీ యాంకర్ చేసిన చిన్న మిస్టేక్ వైరల్

ఛానెల్ లైవ్‌లో ఏ మాత్రం అలెర్ట్‌గా లేకపోయినా అంతే. యాంకర్లు ట్రోల్ అయ్యే పరిస్థితి ఇప్పుడు. గతంలో చాలామంది యాంకర్లు వార్తలు చదివే సమయంలో తప్పిదాలు చేస్తే.. తాజాగా బీబీసీ యాంకర్ చేసిన చిన్న తప్పిదం వైరల్ అవుతోంది.

BBC anchor mistake : లైవ్‌లో అలెర్ట్‌గా లేకపోతే అంతే.. బీబీసీ యాంకర్ చేసిన చిన్న మిస్టేక్ వైరల్

BBC anchor mistake

BBC anchor mistake :  బీబీసీ యాంకర్ చేసిన చిన్న తప్పిదం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లైవ్ లో అలర్ట్ గా లేకపోవడంతో తాను చేసిన తప్పిదం తెలుసుకుని షాకయ్యింది. ఇంతకీ ఏం జరిగింది?

Mirabai Chanu : ‘బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు గెలుచుకున్న మీరాబాయి చాను..వరుసగా రెండుసార్లు సాధించిన మొదటి అథ్లెట్‌గా రికార్డు

బీబీసీ యాంకర్ లుక్వేసా బురాక్ మధ్యాహ్నం వార్తలు చదువుతోంది. సెర్బియా స్కూలులో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించిన అంశంపై మాట్లాడి వార్తను ఫినిష్ చేసింది. ఈ వార్తకు సంబంధించిన రికార్డెడ్ వీడియో ప్లే అవుతూ అకస్మాతుగా ఆగిపోయి స్టూడియో లైవ్ కి వెళ్లింది.

 

తాను లైవ్ లో ఉన్నట్లుగా లుక్వేసా గుర్తించలేకపోయింది. రెండు చేతులు పైకి చాపి రిలాక్స్ అవుతున్నట్లుగా కనిపించింది. వెంటనే తాను లైవ్ లో ఉన్నట్లు గ్రహించిన లుక్వేసా షాకయ్యింది. వెంటనే తలదించుకుని రెండు సెకండ్లు అలాగే ఉండిపోయింది. ఇక ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ అయ్యింది.

Oscar 2023 : ఆస్కార్ వేదికపైకి గాడిదని తీసుకొచ్చిన యాంకర్.. ఆ గాడిద ప్రత్యేకత ఏంటో తెలుసా??

అయితే ట్విట్టర్ యూజర్లు లుక్వేసాకు మద్దతుగా నిలిచారు. ఇలాంటి పొరపాట్లు సహజమేనని ఆమెను అర్ధం చేసుకోమని అభిప్రాయపడ్డారు. కొన్ని సందర్భాల్లో పలు టీవీ ఛానెల్స్ లో తప్పిదాలు దొర్లిన సంఘటనలు చూసాము. అయితే ఇప్పుడు ఎక్కడ ఏ తప్పు జరిగినా వెంటనే బట్టబయలు చేసేందుకు సోషల్ మీడియా కాపు కాసి ఉంది. కాబట్టి ఇలాంటి తప్పిదాలు జరగకుండా ఉండాలంటే యాంకర్లు అలర్ట్ గా ఉండాలనే విషయం ఈ న్యూస్ చెప్పకనే చెబుతోంది.