Pakistan Earthquake : వామ్మో.. మరీ ఇంత ధైర్యమా..! భూకంపానికి భవనం ఊగుతున్నా వార్తలు చదిన యాంకర్.. వీడియో వైరల్

మంగళవారం రాత్రి పాకిస్థాన్ లో భూకంపం సంభవించింది. ఆ సమయంలో ఓ టీవీ ఛానెల్ భవనం కుదుపులకు గురైంది. ఆ సమయంలోనూ కార్యాలయంలో యాంకర్ వార్తలు చదువుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు యాంకర్ ధైర్యాన్నిచూసి ఆశ్చర్యపోతూ ప్రశంసలతో రీ ట్వీట్లు చేస్తున్నారు.

Pakistan Earthquake : వామ్మో.. మరీ ఇంత ధైర్యమా..! భూకంపానికి భవనం ఊగుతున్నా వార్తలు చదిన యాంకర్.. వీడియో వైరల్

tv anchor

Pakistan Earthquake : భూకంపం వస్తుందని ప్రచారం జరిగినా చాలు.. భయంతో భవనాల్లోనుంచి పరుగులు పెట్టుకుంటూ బయటకొచ్చేస్తాం. రాత్రంతా రోడ్లపై జాగారం చేస్తాం. ఇంట్లోకి వెళ్లాలంటే భయంతో వణికిపోతాం. కానీ, భూకంపం ధాటికి బిల్డింగ్ ఊగుతున్నా, పక్కనే ఉన్న టీవీలు కింద పడిపోతున్నా పాకిస్థాన్‌లోని ఓ టీవీ ఛానెల్ యాంకర్ మాత్రం అలాగే వార్తలు చదువుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వామ్మో.. మరీ ఇంత ధైర్యమా..! అంటూ యాంకర్ ధైర్యాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.

Earthquake : పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ లో భారీ భూకంపం

కాబూల్ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 9.30 గంటలకు ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాల్లో భూకంపం సంభవించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. ఈ భూకంపం తీవ్రత 6.5గా నమోదైంది. న్యూఢిల్లీలోనూ 30 సెకన్లకుపైగా భూమి కంపించింది. ముఖ్యంగా ఆప్ఘనిస్థాన్, పాకిస్థాన్ లోని పలు నగరాల్లో భూకంపం దాటికి ఇళ్లు నేలమట్టమయ్యాయి. 12 మంది మరణించగా.. పలువురు గాయపడ్డారు. గాయపడ్డవారికి చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. పాకిస్థాన్ రాజధానిలోని ఖుదాదాద్ హైట్స్, భవనంలో భారీ పగుళ్లు రావడంతో బహుళ అంతస్తుల నివాస సముదాయాన్ని ఖాళీ చేయించారు.

 

 

భూకంప ప్రభావం పాకిస్థాన్‌లోని పెషావర్‌లో కూడా కనిపించింది. పెషావర్‌లో భూకంపం దాటికి ఓ టీవీ ఛానెల్ భవనం కొద్ది సెంకన్లు ఊగింది. ఆ సమయంలో వార్తలు చదువుతున్న యాంకర్ భవనం ఊగుతున్నా ఏమాత్రం భయపడకుండా తన పనిలో నిమగ్నమైపోయాడు. యాంకర్ వెనుకాల టీవీలు కింద పడుతున్నా, యాంకర్ ఏమాత్రం భయపడకుండా వార్తలు చదువుతూనే ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు. యాంకర్ ధైర్యాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.