Earthquake : పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ లో భారీ భూకంపం

పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ లో భారీ భూకంపం సంభవించింది. పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్ ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు సంభవించాయి. అక్కడ భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. భూకంప తీవ్రతకు పలు భవనాలు బీటలు వారాయి.

Earthquake : పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ లో భారీ భూకంపం

earthquake (2)

Earthquake : పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ లో భారీ భూకంపం సంభవించింది. పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్ ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు సంభవించాయి. అక్కడ భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. భూకంప తీవ్రతకు పలు భవనాలు బీటలు వారాయి. ఇంటి పైకప్పులు ధ్వంసమయ్యాయి. ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్, రావల్పిండి, కేత్వా, కోహట్టతోపాటు పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. ఖైబర్ ఫఖ్తూంఖ్వా, పంజాబ్ లో హైఅలర్ట్ ప్రకటించారు.

భూకంప ప్రభావంతో పలు చోట్లు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భూకంపం దెబ్బకు ఇద్దరు మృతి చెందగా 150 మందికి పైగా గాయపడ్డారు. పాకిస్తాన్ లో భూకంపం నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రధాని ఆదేశించారు. ఇస్లామాబాద్ లోని ప్రధాన అస్పత్రులు హైఅలర్ట్ లో ఉన్నాయని ఆరోగ్యశాఖ మంత్రి అబ్దుల్ ఖాదర్ తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు ఆస్పత్రులకు అలర్ట్ ప్రకటించారు.

Delhi Earthquake : ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

ఆఫ్ఘానిస్తాన్ లోనూ భారీ భూకంపం సంభవంచింది. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూమి కంపించింది. ఫైజాబాద్ కు 133 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలాజీ తెలిపింది. భూమికి 190 కిలో మీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది.
భారీ భూకంపం సంభవించడంతో చాలా మంది ఇళ్ల నుంచి బయటికి వచ్చి ఖాళీ ప్రదేశాల్లో నిల్చున్నారు. భారత దేశ రాజధాని ఢిల్లీలోనూ రాత్రి భూమి కంపించింది. రాత్రి 10.17 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.6 ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి.