Ukrainian Women : యుక్రెయిన్ మహిళలపై రష్యా సైనికుల పైశాచికత్వం.. ఫోరెన్సిక్ నివేదికలో సంచలన నిజాలు..!

Ukrainian Women : సైనిక చర్య పేరుతో యుక్రెయిన్‌లోకి చొరబడిన రష్యా సైనికుల పైశాచికత్వానికి చాలామంది యుక్రెయిన్ మహిళలు బలయ్యారు. ఫోరెన్సిక్ నివేదికలో సంచలన నిజాలు బయటపడ్డాయి.

Ukrainian Women : యుక్రెయిన్ మహిళలపై రష్యా సైనికుల పైశాచికత్వం.. ఫోరెన్సిక్ నివేదికలో సంచలన నిజాలు..!

Ukrainian Women Some Ukrainian Women Were Raped Before Being Killed, Reveals Autopsy

Ukrainian Women : సైనిక చర్య పేరుతో యుక్రెయిన్‌లోకి చొరబడిన రష్యా సైనికుల పైశాచికత్వానికి చాలామంది యుక్రెయిన్ మహిళలు బలయ్యారు. యుక్రెయిన్‌లోని కైవ్ నగరంలో వందలాది మంది మహిళలను రష్యా సైనికులు విచక్షణ లేకుండా కాల్చి చంపేశారు. అయితే రష్యా బలగాలు యుక్రెయిన్ మహిళలను చంపాడానికి ముందు వారిపై అత్యాచారానికి పాల్పడినట్టు పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కైవ్ నగరంలోని రష్యా బలగాల చేతుల్లో బలైన యుక్రెయిన్ మహిళల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. సమాధులలోని మృతదేహాలకు శవపరీక్షలు నిర్వహించగా.. కొంతమంది యుక్రేనియన్ మహిళలను చంపడానికి ముందు రష్యా దళాలు అత్యాచారం చేశాయని వైద్యులు వెల్లడించారు.

మహిళలను కాల్చి చంపే ముందు అత్యాచారం చేశారనడానికి తమ దగ్గర ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయని యుక్రేనియన్ ఫోరెన్సిక్ వైద్యుడు వ్లాడిస్లావ్ పెరోవ్స్కీ వెల్లడించారు. ఆమె తన ఫోరెన్సిక్ బృందంతో కలిసి డజనుకుపైగా మహిళల మృతదేహాలకు శవపరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి పూర్తి వివరాలను అందించలేమని తెలిపారు. ప్రస్తుతం తన బృందంతో కలిసి డేటాను సేకరించే పనిలో ఉన్నామని, పూర్తి వివరాలు తెలిసిన తర్వాత ప్రకటిస్తామని అన్నారు. ఇంకా వందలాది మృతదేహాలు ఉన్నాయని, వాటికి అన్నింటికి ఇంకా శవ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని వ్లాడిస్లావ్ పేర్కొన్నారు. కైవ్ ప్రాంతానికి చెందిన సీనియర్ ప్రాసిక్యూటర్ ఒలేహ్ త్కలెంకో మాట్లాడుతూ.. మహిళలపై అత్యాచార వివరాలకు సంబంధించి సేకరించిన డేటాను ఇప్పటికే తమ కార్యాలయానికి పంపినట్టు తెలిపారు. యుక్రెయిన్ మహిళలపై అత్యాచార ఘటనలు చాలా సున్నితమైన అంశంగా తెలిపారు. ఫోరెన్సిక్ వైద్యులు మహిళా మృతదేహాలను పరీక్షిస్తున్నారని త్కలెంకో అన్నారు.

Ukrainian Women Some Ukrainian Women Were Raped Before Being Killed, Reveals Autopsy (1)

Ukrainian Women Some Ukrainian Women Were Raped Before Being Killed, Reveals Autopsy 

మరోవైపు.. రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఏదో రకంగా భయపెట్టి యుక్రెయిన్ హస్తగతం చేసుకోవాలని భావించిన పుతిన్‌కు యుక్రెయిన్ సైన్యం గట్టిగా సమాధానం చెబుతోంది. మరోపక్క ఇతర దేశాలు కూడా యుక్రెయిన్ కు మద్దతుగా యుద్ధానికి సంబంధించి ఆయుధాలను పంపుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ మరింత కఠినంగా వ్యవహరిస్తున్నాడు. రష్యాపై ఆంక్షలు విధించిన దేశాలకు హెచ్చరికలు జారీ చేశాడు. మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధం కావాలంటూ పుతిన్ సంకేతాలు పంపుతున్నారు. ఇప్పటికే యుక్రెయిన్ యుద్ధభూమిలోకి రష్యా భారీ మొత్తంలో ఆయుధాలు, మందుసామాగ్రిని తరలిస్తోందంటూ ఓ నివేదిక వెల్లడించింది. రష్యా హెచ్చరికల నేపథ్యంలో యుక్రెయిన్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Read Also : Ukraine Russia War : యుక్రెయిన్ పై కొనసాగుతున్న రష్యా దాడులు.. 26 స్థావరాలు ధ్వంసం