Ukraine Russia War : యుక్రెయిన్ పై కొనసాగుతున్న రష్యా దాడులు.. 26 స్థావరాలు ధ్వంసం

రైల్వే వ్యవస్థ, ఇంధన నిల్వలు, మౌలిక వసతులపై రష్యా బాంబులు వేసింది. 5 రైల్వే జంక్షన్లపై రష్యా దాడుల్లో ఐదుగురు యుక్రెయిన్ పౌరులు మృతి చెందారు. అజోవ్ స్తల్ నుంచి ప్రజల తరలింపునకు యుక్రెయిన్.. ఐక్యరాజ్య సమితి సాయం కోరింది.

Ukraine Russia War : యుక్రెయిన్ పై కొనసాగుతున్న రష్యా దాడులు.. 26 స్థావరాలు ధ్వంసం

War

Ukraine Russia War : యుక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. యుక్రెయిన్ లో 423 లక్ష్యాలపై దాడి చేసినట్లు రష్యా తెలిపింది. యుక్రెయిన్ లోని చమురు శుద్ధి కర్మాగారంపై దాడి చేసినట్లు రష్యా వెల్లడించింది. యుక్రెయిన్ లో 26 స్థావరాలను ధ్వంసం చేశామని రష్యా పేర్కొంది. రైల్వే వ్యవస్థ, ఇంధన నిల్వలు, మౌలిక వసతులపై రష్యా బాంబులు వేసింది. 5 రైల్వే జంక్షన్లపై రష్యా దాడుల్లో ఐదుగురు యుక్రెయిన్ పౌరులు మృతి చెందారు. అజోవ్ స్తల్ నుంచి ప్రజల తరలింపునకు యుక్రెయిన్.. ఐక్యరాజ్య సమితి సాయం కోరింది. యుక్రెయిన్ కు ఆయుధాలు ఇస్తామనడం పట్ల అమెరికాపై రష్యా ఆక్షేపించింది. యుక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా వెంటనే ఆపాలని రష్యా డిమాండ్ చేసింది.

యుక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగుతోంది. పోర్టు నగరం ఒడెస్సాలోని సైనిక స్థావరాలు, నివాస ప్రాంతాలపై రష్యా సేనలు క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. రష్యా దాడుల్లో సామాన్య పౌరులు మృత్యువాతపడుతున్నారు. దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారని.. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. రష్యా భీకర దాడులు చేస్తోన్న డాన్‌బాస్‌ ప్రాంతంలో.. స్థానికులు తమ ఇళ్లను వదిలి వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. ఇళ్లను వదిలి ఎక్కడికి వెళ్లాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం కారణంగా ఇప్పటికే సర్వస్వం కోల్పోయామని.. ఇక చావైనా, బ్రతుకైనా ఇక్కడేనంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Russian Oil Depot : యుక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా ఆయిల్ డిపో ధ్వంసం.. భారీగా మంటలు.. వీడియో వైరల్

మరియుపోల్‌లోని అజోవ్ స్టీల్‌ ప్లాంట్‌లో చిక్కుకుపోయిన యుక్రెయిన్‌ పౌరుల పరిస్థితి దయనీయంగా మారింది. స్టీల్‌ ప్లాంట్‌ను కైవసం చేసుకునేందుకు రష్యా సేనలు ఎయిర్‌ స్ట్రైక్స్‌ చేస్తున్నాయి. దీంతో అజోవ్ స్టీల్‌ ప్లాంట్‌లో తలదాచుకుంటున్న పౌరులు.. బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్‌, రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌లు.. యుక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు వెళ్లారు. అక్కడ యుక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. రష్యా దాడులను ఎదుర్కొనేందుకు.. తమకు భారీ ఆయుధాలను అందించాలని వారిని జెలెన్‌స్కీ కోరారు. ఎక్కువ ఆయుధాల‌ను త‌మ‌కు ఇస్తే, ర‌ష్యా చేతుల్లోకి వెళ్లిన త‌మ భూభాగాల‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటామ‌న్నారు.