Russian Oil Depot : యుక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా ఆయిల్ డిపో ధ్వంసం.. భారీగా మంటలు.. వీడియో వైరల్

Russian Oil Depot : యుక్రెయిన్ సరిహద్దుల్లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. రష్యాకు సంబంధించిన ఆయిల్ డిపోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Russian Oil Depot : యుక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా ఆయిల్ డిపో ధ్వంసం.. భారీగా మంటలు.. వీడియో వైరల్

Russian Oil Depot Near Ukraine Border Goes Up In Flames, Video Viral

Russian Oil Depot : యుక్రెయిన్ సరిహద్దుల్లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. రష్యాకు సంబంధించిన ఆయిల్ డిపోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మేరకు ఎమర్జెన్సీ సర్వీసెస్ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. సోమవారం తెల్లవారుజామున బ్రయాన్క్స్ నగరంలోని చమురు నిల్వలో మంటలు చెలరేగినట్టు చెబుతున్నారు. ఇందన డిపోలో నుంచి మంటలు తీవ్రస్థాయిలో ఎగసిపడుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. బ్రయాన్స్క్ అనేది.. యుక్రెయిన్ సరిహద్దులో ఉన్న ప్రాంతంగా పిలుస్తారు. మాస్కోకు నైరుతి దిశలో 380 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఏప్రిల్ 22న రష్యా వైమానిక దాడిలో యుక్రెయిన్‌లోని ఖార్కివ్ ప్రాంతంలోని చుగ్వివ్ సమీపంలోని చమురు డిపోను ధ్వంసం చేశాయి. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే ఈ ఘటన జరిగింది. ఏప్రిల్ ప్రారంభంలో యుక్రేనియన్ హెలికాప్టర్లు రష్యాలోని బెల్గోరోడ్‌లోని రోస్‌నెఫ్ట్ ఇంధన డిపోపై దాడి చేశాయి.

Oil Tank

Oil Tank

యుక్రెయిన్‌ ఆర్మీకి చెందిన రెండు హెలికాప్టర్లు చేసిన దాడి చేయడంతో రష్యా చమురు డిపోలో మంటలు చెలరేగాయి. రష్యా భూభాగంలో తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ యుక్రెయిన్ హెలికాప్టర్లు దాడులు చేశాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం లేదని అధికారులు వెల్లడించారు. అదే ప్రాంతంలోని ఆయుధ డిపోపై కూడా యుక్రెయిన్‌ బలగాలు దాడిచేసి ధ్వంసం చేశాయి.


ఈ ఘటనలో ఇద్దరు ఉద్యోగులు గాయపడినట్లు తెలిసింది. డిపో చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలను వెంటనే ఖాళీ చేయించినట్లు అధికారులు వెల్లడించారు. మంటలను ఆర్పేందుకు అత్యవసర దళాలు అక్కడకు చేరుకొన్నాయి. ఈ ఘటనపై యుక్రెయిన్‌ నుంచి ఎలాంటి అధికారిక ధ్రువీకరణ వెల్లడి కాలేదు. కానీ, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also : Russia ukraine : war @ 2నెలలు..యుక్రెయిన్ పై యుద్ధంతో రష్యా ఏం సాధించింది…?