Sticker Heist : వాట్సాప్ నుంచి మనీ హైస్ట్ స్టిక్కర్ ప్యాక్‌.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

మనీ హీస్ట్.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన స్పానిష్ క్రైమ్ డ్రామా టెలివిజన్ సిరీస్. ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లపై ఏమాత్రం అవగాహన ఉన్నవారికైనా.. మనీ హీస్ట్ సిరీస్‌ గురించి

Sticker Heist : వాట్సాప్ నుంచి మనీ హైస్ట్ స్టిక్కర్ ప్యాక్‌.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

Sticker Heist

Sticker Heist : మనీ హీస్ట్.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన స్పానిష్ క్రైమ్ డ్రామా టెలివిజన్ సిరీస్. ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లపై ఏమాత్రం అవగాహన ఉన్నవారికైనా.. మనీ హీస్ట్ సిరీస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సిరీస్​కు భారత్​లోనూ మంచి ఆదరణ ఉంది. సాధారణంగా దేశీయంగా తెరకెక్కే సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల కోసం మనోళ్లు ఎదురు చూస్తున్నారంటే పెద్ద ఆశ్చర్యం కలగదు.

కానీ అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిన ఓ సిరీస్‌కు భారత్‌లోనూ అభిమానులు ఉండడం నిజంగా ఆశ్చర్యం కలిగించే అంశమే. అదీ మనీ హీస్ట్ కున్న క్రేజ్. తాజాగా మనీ హీస్ట్ ఫైనల్‌ సీజన్‌-5 సెప్టెంబర్‌ 3న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మనీ హీస్ట్ ఫీవర్ నెలకొని ఉంది. ఈ క్రమంలో ప్రముఖ షార్ట్ మేసేజింగ్ యాప్ వాట్సాప్ మనీ హీస్ట్ పేరుతో కొత్త స్టిక్కర్ ప్యాక్ విడుదల చేసింది.

Celebrities Costly Bikes: ఎంఎస్ ధోనీ నుంచి మాధవన్ వరకూ సెలబ్రిటీలు లక్షలు పోసి కొనుక్కున్న బైక్‌లివే..

వాట్సాప్ దాదాపు ప్రతి సందర్భంలోనూ తన వినియోగదారుల కోసం కొత్త స్టిక్కర్ ప్యాక్‌లను తెస్తుంది. అదే విధంగా, ఇప్పుడు ప్రముఖ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ మనీ హీస్ట్ ను దృష్టిలో పెట్టుకుని Android, iOS డివైజస్ కోసం ‘స్టిక్కర్ హీస్ట్’ పేరుతో కొత్త స్టిక్కర్ ప్యాక్‌ను ప్రవేశపెట్టింది. ఇది యానిమేటేడ్ స్టిక్కర్ ప్యాక్. ముచో పిక్సెల్స్ ద్వారా రూపొందించబడింది. ఇందులో మొత్తం 17 స్టిక్కర్లు ఉన్నాయి. బరువు కేవలం 658KB మాత్రమే. మనీ హీస్ట్ సీజన్ ఫైవ్ నెట్ ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 3న రిలీజ్ అయ్యింది. ప్రస్తుతానికి ఫస్ట్ పార్ట్ అందుబాటులో ఉంది. సెకండ్ పార్ట్ డిసెంబర్ లో రిలీజ్ కానుంది.

వాట్సాప్ లో మనీ హీస్ట్ స్టికర్స్ డౌన్ లోడ్ చేసుకునే విధానం..

Step 1: కొత్త స్టిక్కర్ ప్యాక్ పొందాలంటే ముందుగా వాట్సాప్ ను అప్ డేట్ చేసుకోవాలి.

Step 2: వాట్సాప్ లోకి వెళ్లి ఏదైనా చాట్ ఓపెన్ చేయాలి.

Step 3: చాట్ బార్ మీదున్న స్టిక్కర్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ‘+’ సైన్ మీద క్లిక్ చేయాలి.

Step 4: చివరగా లిస్టులో టాప్ లో కనిపించే స్టిక్కర్ హెయిస్ట్ ప్యాక్ పైన క్లిక్ చేయాలి.

Step 5: ఇక డౌన్ లోడ్ చేసుకోండి, స్టిక్కర్స్ వాడుకోండి.

వాట్సాప్ లో ఎక్కువ మనీ హీస్ట్ స్టిక్కర్స్ ఇలా పొందండి..

* ఎక్కువ స్టిక్కర్స్ కావాలంటే ప్లే స్టోర్ కి వెళ్లాలి. థర్డ్ పార్టీ యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవాలి.

Step 1: గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయాలి. ”Money Heist stickers for WhatsApp” అని సెర్చ్ చేయాలి. అప్పుడు మీకు అనేక ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో మీకు నచ్చినది ఒకటి డౌన్ లోడ్ చేసుకోండి.

Step 2: ఇప్పుడు, వాట్సాప్ అనుమతితో సహా ఇతర యాప్‌లతో అనుసంధానం చేయడానికి అవసరమైన అనుమతిని యాప్‌ని అనుమతించండి. చివరగా, మీరు మీ WhatsApp లో కొత్త స్టిక్కర్ ప్యాక్‌ని చూడవచ్చు.

మీ గ్యాలరీ నుండి ఇతర ఫోటోలను ఉపయోగించి మీరు కస్టమ్ స్టిక్కర్‌లను కూడా చేయవచ్చు. దాని కోసం, మీరు ‘Sticker Make for WhatsApp’ లేదా ‘Sticker.ly’ యాప్‌ను ప్లే స్టోర్ లేదా Apple యాప్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి.

Tambulam : భోజనం తరువాత తాంబూలం వేసుకోవటం మంచిదేనా!..

నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ వ్యూయర్‌షిప్‌ ఉన్న సిరీస్‌ మనీ హీస్ట్. మనీ హెయిస్ట్‌ ఇప్పటిదాకా 2 సీజన్స్‌.. నాలుగు పార్టులు.. 31 ఎపిసోడ్స్‌గా టెలికాస్ట్ అయ్యింది. ఇప్పుడు రెండో సీజన్‌లో ఐదో పార్ట్‌ గా పది ఎపిసోడ్స్‌తో రాబోతోంది. సెప్టెంబర్‌ 3న ఐదు ఎపిసోడ్స్‌గా రిలీజ్‌ కానుంది. ఈ ఏడాది డిసెంబర్‌లో మిగిలిన ఐదు రిలీజ్‌ అవుతాయి. ఈ సిరీస్ లోని ప్రొఫెసర్ పాత్రతో అల్వరో మర్టోతో పాటు పోలీస్ ఆఫీసర్ పాత్ర “రాకేల్ మరిల్లో”, టోక్యో, బెర్లిన్, రియో, డెన్వర్, బోగట్టా, మాస్కో వంటి పలు పాత్రలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఈ నాలుగేళ్లలో ఏర్పడింది.

ఈ స్పానిష్ సిరీస్ కథ… ప్రొఫెసర్ అని పిలిచే సూత్రధారి, బ్యాంక్ దొంగతనం కోసం కలిసి పని చేసే దొంగల బృందం చుట్టూ తిరుగుతుంది. సీజన్ 4లో ప్రొఫెసర్ డైరక్షన్ తో.. దొంగల బృందం సేఫ్ గా బ్యాంక్ ఆఫ్ స్పెయిన్ నుంచి డబ్బు కొట్టేసి తప్పించుకోగా.. సీజన్ -5లో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ “రఖెల్ మోరియో”వారిని పట్టుకోగలుగుతుందా లేదా అనేది ఆశక్తికరంగా మారింది.

అంతేకాకుండా సీజన్ 4 చివర్లో దొంగల ముఠా నాయకుడు “ఫ్రొఫెసర్” తో పోలీస్ ఆఫీసర్ రాకేల్ మరిల్లో ప్రేమలో పడినట్లు చూపించడంతో నెక్ట్స్ ఏం జరుగుతుందో అని అందరూ ఆసక్తిగా ఈ సిరీస్ కోసం ఎదరుచూస్తున్నారు.