Tambulam : భోజనం తరువాత తాంబూలం వేసుకోవటం మంచిదేనా!..

చాలా మంది భోజనం అనంతరం ఆకు వక్క,సున్నంతో కలిపి నములుతుంటారు. తమలపాకుల రసం సున్నంలోని కాల్సియంను శరీరం శోషించుకునేలా చేస్తే వక్కపొడి నోట్లో లాలాజలం ఊరేలా చేస్తుంది. అనేక

Tambulam : భోజనం తరువాత తాంబూలం వేసుకోవటం మంచిదేనా!..

Thambulam

Tambulam : హిందూ సంస్కృతీ సాంప్రదాయంలో తాంబూలానికి విశిష్టమైన స్ధానం ఉంది. దేవుని పూజలకు వీటిని వినియోగిస్తుంటారు. ఆయుర్వేద వైద్యంలో తమలపాకుల సేవనాన్ని ప్రత్యేకం చెప్పారు. తమలపాకులో అనేక పోషకాలు ఉన్నాయి. మనిషి శరీరానికి కావాల్సిన పోషకాలు తమలపాకు నుండి లభిస్తాయి. అందుకే పూర్వం నుండి తమలపాకు మానవ జీవన గమనంలో అంతాగా భాగమై పోయింది. ఇందులో అనేక ఔషదగుణాలు ఉన్నాయి. కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఏ, విటమిన్ సి, తోపాటు రోగ నిరోధక శక్తిని పెంపొందించటంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. తమల పాకులో పీచు పదార్ధం అధికంగా ఉంటుంది.

చాలా మంది భోజనం అనంతరం ఆకు వక్క,సున్నంతో కలిపి నములుతుంటారు. తమలపాకుల రసం సున్నంలోని కాల్సియంను శరీరం శోషించుకునేలా చేస్తే వక్కపొడి నోట్లో లాలాజలం ఊరేలా చేస్తుంది. అనేక రుగ్మతలను తొలగించేందుకు ఆకులు బాగా ఉపయోగడతాయి. తమలపాకులు, మిరియాలు కలిపి తింటే అధిక బరువు తగ్గుతారు. బరువును తగ్గించే గుణాలు ఈ రెండు కలిపి తీసుకుంటే లభిస్తాయి. జలుబు,దగ్గుతో బాధపడుతుంటే తమలపాకుల రసం, తులసి రసం,అల్లం రసం, మిరియాల పొడి, తేనె కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఛాతిలో ఏర్పడే కఫం కరగాలంటే తమలపాకులు, ఆముదం కలిపి ఛాతిపై పట్టుగా వేయాలి.

తమలపాకుల్లో యాంటీబయాటిక్ గుణాలు ఆనారోగ్యసమస్యలు రాకుండా చేస్తాయి. వాపులను తగ్గించటంతోపాటు, జీర్ణశక్తినీ పెంచుతాయి. దంతాలు, చిగుళ్ళ ఆరోగ్యానికి బాగా పనిచేస్తాయి. బాగా కోపంతో ఉండేవారు తమలపాకుల రసంలో తేనె కలుపుకుని తీసుకుంటే కోపం కంట్రోల్ లో ఉంటుంది. మంచి కఠస్వరం కోరుకునే వారు తమలపాకుల కొమ్మను నోట్లు ఉంచుకుని నములుతూ రసం పీల్చితే కంఠ స్వరం బాగా ఉంటుంది.

చాలా మందిలో ఎంత నీరు తాగినా దాహం వేస్తుంటుంది. అలాంటి వారు తమలపాకులు నమిలితే పదేపదే దాహం వేయకుండా ఉంటుంది. ముఖసౌందర్యానికి కూడా తమలపాకులు బాగా ఉపయోగపడతాయి. తమలపాకులను నీటిలో మరగించి ఆనీటితో మొఖం తుడుచుకుంటే మొటిమలు, పొక్కులు వంటివి మొఖంపై రాకుండా ఉంటాయి. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. తమలపాకులను పొగాకుతో కలిపి తీసుకుంటే నోటి క్యాన్సర్ వంటి వ్యాధులబారిన పడే అవకాశాలు ఉన్నాయి.