Taiwan keel-Laying : చైనాను ధిక్కరించి..సొంతంగా సబ్‌మెరైన్లు తయారు చేసుకుంటున్న తైవాన్..జీర్ణించుకోలేకపోతున్న చైనా

చైనాను ధిక్కరించి..సొంతంగా సబ్‌మెరైన్లు తయారు చేసుకుంటోంది తైవాన్. ‘కీల్‌ లేయింగ్‌’ ఉత్సవాన్ని నిర్వహించింది. దీన్ని చైనా భరించలేకపోతోంది. డ్రాగన్ దేశానికి కంటగింపుగా మారింది.

Taiwan keel-Laying : చైనాను ధిక్కరించి..సొంతంగా సబ్‌మెరైన్లు తయారు చేసుకుంటున్న తైవాన్..జీర్ణించుకోలేకపోతున్న చైనా

Taiwan Submarine Keel Laying Ceremony

Taiwan submarine keel laying ceremony : చైనా టెక్నాలజీలో దూసుకుపోతున్నా దేశం. ఓ పక్క అభివృద్ది చెందుతునే మరోపక్క పక్క దేశాల స్థితిగతులను బట్టి ఆ దేశంపై ఆధిపత్యం కోసం ఎత్తులు వేస్తుంటుంది. పలు దేశాల అవసరాలను..ఆర్థిక స్థితి గతులను గమనించి ఆ దేశాలపై ఆధిపత్యంచేయాలనుకుంటుంది. అలాగే చిన్న చిన్న దేశాలు బలపడకుండా తనపైనే ఆధారపడేలా చేసి తద్వారా లబ్ది పొందాలనుకుంటుంది చైనా. ఇలా కుయుక్తులతో కుట్రలు చేస్తుంటుంది. దీంట్లో భాగంగానే తైవాన్‌ ను గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంది. ముఖ్యంగా నావిదళం విషయంలో తైవాన్ పై చైనా ఆధిపత్యం చెలాయిస్తోంది. తైవాన్ నావికాదళం పెరగకుండా తనపైనే ఆధారపడి ఉండేలా ఏళ్లపాటు అడ్డంపడింది చైనా..! కానీ తైవాన్ మాత్రం చాపకింద నీరులో తన పనిలో తానుకుంది. అలా చైనా కబంధ హస్తాల్లో చిక్కకుండా, సొంతగానే డ్రాగన్‌ను ఎదుర్కొనేందుకు తైవాన్‌ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. తైవాన్ యత్నాలకు భారత్ తో పాటు పలు దేశాలు తైవాన్ కు అండగా నిలిచినట్లుగా తెలుస్తోంది. ఇది చైనాకు నచ్చటంలేదు. కంటగింపుగా ఉంది. ముఖ్యంగా తైవాన్ నావికాదళం పెంచుకోవటానికి సొంతంగా సబ్ మెరైన్లను తయారు చేయటం చైనాకు కంటగింపుగా మారింది.

Read more : Pizza: పిజ్జా పిండిలో రేజర్‌ బ్లేడ్లు,నట్లు పెట్టిన వ్యక్తి..జైలు శిక్ష విధించిన న్యాయస్థానం

తైవాన్‌ సబ్‌మెరైన్ల నిర్మాణ ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తుంటే చైనాకు కుళ్లుకుంటోంది. తైవాన్ నావికాదళం పెంచుకునే భాగంలో నవంబరు మధ్యలో సబ్‌మెరైన్ల నిర్మాణానికి సంబంధించిన పనులు కీలక దశ దాటింది. ఆ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవటానికి తైవాన్ ‘కీల్‌ లేయింగ్‌’ ఉత్సవాన్ని నిర్వహించింది. దీనికి మీడియాను ఆహ్వానించలేదు. కానీ..ఓ చానల్ దీన్ని ప్రసారం చేసిందంటూ తైవాన్‌ న్యూస్‌ పత్రిక ఈ కార్యక్రమం ఫొటోలతో సహా కథనాన్ని ప్రచురించింది. కానీ..ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని తైవాన్ కూడా భావించలేదు.అందుకే దాన్ని తైవాన్‌ పెద్దగా పట్టించుకోలేదు.

ఈ క్రమంలో నవంబరు 30న తైవాన్‌లో అధికారిక డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ సెక్రటరీ జనరల్‌ త్సాయి షిహ్‌ యంగ్‌ మాట్లాడుతూ.. ‘‘తైవాన్‌కు సహకరిస్తున్నందుకు ప్రపంచంలో సబ్‌మెరైన్లు తయారు చేసే ప్రధాన దేశాలకు ధన్యవాదాలు అని తెలిపారు. తమకు సహకరించే దేశాలు? ఏవి..అవి ఎన్ని అనేది ముఖ్యం కాదు. కానీ మాకు సహకరించే దేశాలకు ధన్యవాదాలు తెలపటం మా బాధ్యత అని తెలిపారు. ఇలా తమకు సహకరించే దేశాలను ధన్యవాదాలు చెబుతునే చైనా చురకులు అంటించారు. చైనా మా సబ్‌మెరైన్ల ప్రాజెక్టులో జోక్యానికి ప్రయత్నించదని మేం ఆశిస్తున్నాం అని అన్నారు.

Read more : 6 students murder case : విద్యార్థులను కొట్టి చంపిన కేసు..13 మందికి ఉరిశిక్ష..19 మందికి జీవిత ఖైదు

తైవాన్‌ సబ్‌మెరైన్‌ ప్రాజెక్టుకు బ్రిటన్‌, అమెరికా, కెనడాల్లోని సంస్థలు సాయం చేస్తున్నట్లు ఓ వార్త సంస్థ వెల్లడించింది. దీంతోపాటు బ్రిటన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, భారత్‌, స్పెయిన్‌, కెనడా దేశాలకు చెందిన నావికాదళ మాజీ అధికారులు, టెక్నిషీయన్లను తైవాన్‌ నియమించకొన్నాని కూడా తెలిపింది సదరు వార్తా సంస్థ.

తైవాన్ ఎదరకుండా ఏళ్లతరబడి అడ్డంపడిన చైనా..
తైవాన్‌ సొంతగా బలపడకుండా చైనా ఎన్నో ఏళ్లుగా అడ్డం పడుతు వస్తోంది. తైవాన్ కూడా అంత పెద్ద దేశంతో కయ్యం పెట్టుకోవటమెందుకు అని ఊరుకుంటు వచ్చింది. కానీ చైనా మాత్రం తైవాన్ మీద ఆధిపత్యం కోసం ప్రతి విషయంలో యత్నిస్తునే ఉంది. ఇది తైవాన్ కు నచ్చలేదు. చైనా ఓ పక్క తైవాన్ నావికాదళం పెరగకుండా అడ్డం పడుతునే..మరోపక్క చైనా మాత్రం అడ్డగోలుగా నావికా దళ బలాన్ని పెంచుకొంటోంది.

దీంతో తైవాన్ కు పట్టుదల పెరిగింది. సొంతగా సబ్‌మెరైన్ల తయారీనే మొదలుపెట్టింది. తైవాన్‌ నావికాదళమైన ‘ది రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా నేవీ’ వద్ద ఇప్పటికీ చాలా పురాతన సబ్‌మెరైన్లు ఉన్నాయి. 1973లో అమెరికా తయారు చేసిన టెంచ్‌, బాలో క్లాస్‌ సబ్‌మెరైన్లు, 1987లో డచ్‌ తయారు చేసిన జ్వార్డివ్స్‌ సబ్‌మెరైన్లు రెండు మాత్రమే ఉన్నాయి. ఇక 1980ల్లో అమెరికా నుంచి టార్పిడోలు కొనుగోలుకు తైవాన్‌ యత్నించినా.. సాధ్యంకాలేదు. 1940ల్లో అమెరికా తయారు చేసిన మరో సబ్‌మెరైన్లు ఉన్నాయి. ఇవి చైనాతో యుద్ధంలో ఏమాత్రం ఉపయోగపడవు. వాటి బలం సరిపోదు. వీటిని కేవలం ట్రైనింగ్ కు మాత్రమే వాడుతున్నారు. 1980 నుంచే తైవాన్‌కు సబ్‌ మెరైన్లు అందకుండా చైనా తీవ్ర యత్నాలు మొదలుపెట్టింది.

Read more : Omicron Variant : వ్యాక్సిన్ తీసుకున్న వారికే.. పార్కులు, మాల్స్, సినిమా హాల్స్ లోకి అనుమతి

చైనాతో విసిగిపోయిన తైవాన్‌..
పదే పదే తమ విషయంలో చైనా వ్యవహరించే తీరు తైవాన్ కు ఏమాత్రం నచ్చలేదు. దీంతో తెగించింది. అలా 2015లో తైవాన్‌ అమెరికా, జపాన్‌ దేశాల్లో కీలకమైన సబ్‌మెరైన్‌ టెక్నాలజీ సంస్థలతో తైవాన్‌ షిప్‌బిల్డింగ్‌ సంస్థ సీఎస్‌బీసీ ఒప్పందం చేసుకొంది. గతేడాది కొహ్సింగ్‌ సీఎస్‌బీసీ కర్మాగారం తైవాన్‌ కీలక నేతలు కలిసి సబ్‌మెరైన్ల తయారీని లాంఛనంగా ప్రారంభించారు. అధ్యక్షురాలు త్సాయి ఇంగ్‌ వెన్‌ దీనికి సంబంధించిన ఫొటోలను ట్వీట్‌ చేశారు.

ఈ ప్రాజెక్టులో భాగంగానే తొలి సబ్‌మెరైన్‌కు ‘కీల్‌ లేయింగ్‌’ ఉత్సవాన్ని గత నవంబర్ లో నిర్వహించారు. సబ్‌మెరైన్‌లో కీలక భాగాల తయారీ, పరీక్షలు విజయవంతమైతే ఇక సబ్ మెరైన్ల తయారీ నిర్వహిస్తారు. కొత్త సబ్‌మెరైన్‌కు 1168 అనే నెంబర్‌ను కేటాయించారు. 2023 నాటికి ఈ సబ్‌మైరన్‌ను సముద్ర జలాల్లో పరీక్షించాలని నిర్ణయించింది. ఆ తర్వాత మరో ఏడు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే అమెరికా కమాండోలు తైవాన్‌ దళాలకు ఈ విషయంలో ట్రైనింగ్ ఇస్తున్నాయి.

ఇప్పుడు దీనికి తోడు సబ్‌మెరైన్ల తయారీకి అమెరికా, మిత్రదేశాలు సాయం చేస్తుండటం డ్రాగన్‌ దేశానికి కంటగింపుగా మారింది. దీన్ని చైనా జీర్ణించుకోలేకపోతోంది. తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తు ఉకిరి బిక్కిరి అవుతోంది. ‘కీల్‌ లేయింగ్‌’ ఉత్సవంపై చైనాకు చెందిన గ్లోబల్‌ టైమ్స్‌ నవంబర్లోనే స్పందించింది. ‘తైవాన్‌ జలసంధి వద్ద బలాబలాల్లో ఉన్న తేడాలను మార్చలేం. చైనాతో పునరేకీకరణ బలప్రయోగంతో వ్యతిరేకిస్తే పరిస్థితి డెడ్‌ఎండ్‌కు చేరుతుంది’’ అని హెచ్చరించింది. అది డ్రాగన్ దేశం బుద్ది..