Pizza: పిజ్జా పిండిలో రేజర్‌ బ్లేడ్లు,నట్లు పెట్టిన వ్యక్తి..జైలు శిక్ష విధించిన న్యాయస్థానం

పిజ్జా పిండిలో రేజర్‌ బ్లేడ్లు,నట్లు పెట్టిన వ్యక్తికి కోర్టు జైలు శిక్ష విధించింది.

Pizza: పిజ్జా పిండిలో రేజర్‌ బ్లేడ్లు,నట్లు పెట్టిన వ్యక్తి..జైలు శిక్ష విధించిన న్యాయస్థానం

Nh Man Who Put Razor Blades In Pizza Dough Sentenced To Prison (1)

man who put razor blades in pizza :  పిజ్జా తయారుచేసేందుకు సిద్ధం చేసిన తడి పిండిలో రేజర్‌ బ్లేడ్లు, నట్లు ఉంచిన వ్యక్తికి న్యాయస్థానం గురువారం (డిసెంబర్ 2,2021) నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు జైలుశిక్ష విధించింది. న్యూ హాంప్‌షైర్‌లోని డోవర్ కు చెందిన నికోలస్‌ మిషెల్‌(39) అనే వ్యక్తి మెయినీ, ఆ ప్రాంతంలోని సూపర్‌మార్కెట్లలో పిజ్జా పిండిలో రేజర్‌ బ్లేడ్లు, నట్లు ఉంచాడు.

దీంతో అతనిపై 2020 అక్టోబర్ 5 లో కేసు నమోదు అయ్యింది. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. దానిపై విచారణ చేయగా జూన్‌ నెలలో తను చేసిన పనిని అంగీకరించాడు. ఈ క్రమంలో న్యాయమూర్తి తాజాగా నాలుగేళ్ల జైలు శిక్ష విధించారు. అదే సమయంలో నికోలస్‌.. హన్నాఫోర్డ్‌ సూపర్‌మార్కెట్లకు 2.30 లక్షల డాలర్లు నష్టపరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది.అరెస్ట్ చేసిన అతడిని విచారణ కొనసాగుతున్న సమయంలో జైలులో ఉంచారు. ఈక్రమంలో నికోలస్ కోవిడ్-19 కు గురయ్యాడు. కోలుకుంటున్నప్పటికీ విచారణ కొనసాగింది. తాను చేసిన పనికి పశ్చాత్తాప పడిన నికోలస్ కోర్టులో న్యాయమూర్తి ముందు కన్నీరు పెట్టుకున్నాడు..

ఆ సూపర్‌మార్కెట్ లో పిండి కొన్న ముగ్గురు కస్టమర్లు పిండిలో బ్లేడ్‌లు, నట్లు ఉండటం చూసి షాక్ అయ్యారు.దీంతో సదరు సూపర్ మార్కెట్ కు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు సూపర్ మార్కెట్ అతడిని ఉద్యోగంనుంచి తొలగించింది. తరువాత కోర్టులో కేసు వేశారు బాధితులు. అలా కేసు విచారణ కొనసాగిన క్రమంలో నిందుతుడు తన చేసిన పని అంగీకరించటంతో కోర్టు అతనికి నాలుగు ఏళ్ల తొమ్మిది నెలలు జైలుశిక్ష విధించింది. సాధారణంగా ఇటువంటి నేరాలకు 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. కానీ నికోలస్ తన నేరాన్ని అంగీకరించటం..తప్పు చేశానని పశ్చాత్తాపం వ్యక్తం చేస్తు కన్నీరు పెట్టుకోవటంతో శిక్షాకాలం తగ్గించినట్లుగా తెలుస్తోందిజ