Lucky spiders : ఆ సాలెపురుగును చూస్తే అదృష్టం .. మహిళకు తగిలిన బంపర్ లాటరీ

ఆ సాలెపురుగును చూస్తే లక్కును లక్కలాగా అతుక్కుంటుందట. ఓ మహిళకు ఆ సాలీడును చూశాక బంపర్ లాటరీ తగిలింది. ఏకంగా 30 ఏళ్లపాటు ఆమెకు నెలకు లక్షల రూపాలు అందే లాటరీని గెలుచుకుంది.

Lucky spiders : ఆ సాలెపురుగును చూస్తే అదృష్టం .. మహిళకు తగిలిన బంపర్ లాటరీ

Lucky spiders..bumper lottery

Lucky spiders .. సాధారణంగా ఇంట్లో సాలెపురుగులు కనిపిస్తే బూజులు పడతాయని దులిపి పారేస్తాం. కానీ సాలెపురుగుల్లో కూడా అదష్టాన్ని తెచ్చిపెట్టేవి ఉన్నాయట. ఓ రకమైన సాలెపురుగుని చూస్తే అదృష్టం వరిస్తుందట. లక్ లక్కలాగా అతుక్కుని ధనలాభం కలుగుతుందట. అలా ఓ రోజు పొద్దునే లేచి సాలెపురుగుని చూసిన ఓ మహిళకు బంపర్ లాటరీ తగిలింది. తాను ఎంతో కాలం నుంచి లాటరీ టికెట్లు కొన్నా కలుగని అదృష్టం ఆ సాలెపురుగుని చూశాకే వరిందని..పొద్దున్నే లేచి ఆ సాలెపురుగుని చూశాక తనకు బంపర్ లాటరీ తగిలిందని సంబరంగా తెలిపిందో 70 ఏళ్ల మహిళ.

Red Wine River Viral Video : వీధుల్లో ప్రవహించిన రెడ్ వైన్ నది ..

సాలెపురుగుని చూశాక భారీ లాటరీ తగిలిందని మురిసిపోతున్న ఆ మహిళ పేరు ‘డోరిస్ స్టాన్‌బ్రిడ్జ్’(Doris Stanbridge). వయస్సు 70 ఏళ్లు. ఇంగ్లండ్‌ లోని డోర్కింగ్ కు చెందిన డోరిస్ ఇటీవలే తన పుట్టిన రోజు జరుపుకుంది. అదే రోజు ఉదయాన్నే లేచిన ఆమెకు తన ఇంటి ఎదురుగా పచ్చికపై మనీ స్పైడర్ ( money spider)అనే సాలీడు కనిపించింది. అది కనిపిస్తే ఆర్థికంగా లాభం కలుగుతుందని యూకేవాసులు నమ్ముతారు. అదే నమ్మకంతో డోరిస్ తన పుట్టిన రోజునాడే ఓ లాటరీ టిక్కెట్టు కొనుగోలు చేసింది.

ఆ తరువాత కొన్ని రోజులకు లాటరీ సంస్థ వారు డోరిస్‌ కొన్న లాటరీ టికెట్టుకు బంపర్ ప్రైజ్ తగిలిందని తెలిపారు.  ఈ-మెయిల్ ద్వారా డోరిస్ వివరాలు అందించారు. దీంతో డోరిస్ దంపతుల ఆనందానికి అవధుల్లేవు. ఇదంతా మనీ స్పైడర్ ను చూసినందుకు వరించిన అదృష్టం మురిసిపోయారు. ఈ లాటరీ ద్వారా డోరిస్ కు 30 ఏళ్ల పాటు యూకే 10,000 పౌండ్లు అంటే భారత కరెన్సీలో నెలకు రూ.10 లక్షలు అందుతాయని లాటరీ సంస్థ తెలిపింది.

Samudrayaan : సముద్ర గర్భ అన్వేషణ కోసం మొట్టమొదటి మానవసహిత జలాంతర్గామి.. ఫొటోలు పోస్ట్ చేసిన మంత్రి కిరణ్ రిజిజు

దీంతో..డోరిస్ సంబరం అంతా ఇంతా కాదు. ఈ ఆనందంతో తనకు 100ఏళ్లు బతకాలనిపిస్తోంది. ఈ ఆనందం తనకు నిండు నూరేళ్లు ఆయుష్షునిస్తుందని సంబరంగా తెలిపింది. తనకు అందే ఆ డబ్బుతో తన బంధువులందరినీ తీసుకుని విదేశీ టూర్ ప్లాన్ చేస్తున్నానని..తెలిపారు.