Samudrayaan : సముద్ర గర్భ అన్వేషణ కోసం మొట్టమొదటి మానవసహిత జలాంతర్గామి.. ఫొటోలు పోస్ట్ చేసిన మంత్రి కిరణ్ రిజిజు

జాబిల్లి రహస్యాలను ఛేధించేందుకు చంద్రయాన్-3 అయితే ఇక సాగర గర్భాన్ని శోధించటానికి భారత ప్రభుత్వం ‘సముద్రయాన్’ను సంధించనుంది.

Samudrayaan : సముద్ర గర్భ అన్వేషణ కోసం మొట్టమొదటి మానవసహిత జలాంతర్గామి.. ఫొటోలు పోస్ట్ చేసిన మంత్రి కిరణ్ రిజిజు

'MATSYA 6000' submersible

‘MATSYA 6000’ submersible Samudrayaan..minister Kiren Rijiju : చంద్రయాన్ -3 సూపర్ సక్సెస్ అయ్యి ప్రపంచదేశాల దృష్టి అంతా భారత్ పై పడేలా చేసింది. ఇది మన ఇస్రో శాస్త్రవేత్తలు సాధించిన అత్యంత ఘన విజయానికి వారి ప్రతిభకు నిలువుటద్దంలా మారింది. జాబిల్లి రహస్యాలను ఛేధించేందుకు చంద్రయాన్-3 అయితే ఇక సాగర గర్భాన్ని శోధించటానికి భారత ప్రభుత్వం ‘సముద్రయాన్’ను సంధించనుంది. సముద్ర గర్భ అన్వేషణ కోసం మొట్టమొదటి మానవసహిత జలాంతర్గామిని రూపొందిస్తోంది భారత ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు మంత్రి కిరణ్ రిజిజు (Union minister Kiren Rijiju)ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

Chandrayan-3 : మహిళలకు ఉపాధినిస్తున్న చంద్రయాన్-3

సముద్రయాన్ మిషన్ లో భాగంగా సముద్రపు లోతులను అన్వేషించే మావనసమిత సబ్ మెర్సిబుల్ (‘MATSYA 6000’ submersible)మ్సత్య 6000లు ఫోటోలు, వీడియోలను సోమవారం (సెప్టెంబర్ 11,2023)కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పోస్ట్ చేశారు. ఈ సముద్రయాన్ (Samudrayaan)నౌకను చెన్నైలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (National Institute of Ocean Technology) (NIOT)అభివృద్ది చేస్తోంది. అక్వానాట్ లను సముద్రంలో 6,000మీటర్ల లోతుకు తీసుకెళ్లందుకు ఈ సముద్రయాన్ నౌక రూపొందుతోంది. గోళాకారంలో ఉండే ఈ నౌక చాలా ఆసక్తికరంగా ఉంది.

BJP MP Dilip Ghosh: ఇండియా పేరు మార్పు ఇష్టపడనివాళ్లు దేశం వదిలి వెళ్లిపోవచ్చు : బీజేపీ ఎంపీ దిలీప్‌ ఘోష్‌

సముద్రంలో 6,000 మీటర్ల లోతుకు తీసుకెళ్లేందుకు రూపు దిద్దుకుంటున్న ఈ నౌక మొదట కేవలం 500ల మీటర్లు నీటి లోతుకు ప్రయాణం చేయనుంది. సముద్రగర్భ అన్వేషణకు తోడ్పడనున్న ఈ సముద్రయాన్ వద్ల సముద్ర పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. భారతదేశపు మొట్టమొదటి మానవసహిత డీప్ ఓషన్ మిషన్ సముద్రయాన్ నౌకలో ముగ్గురు వ్యక్తులను ఆరు కిలోమీటర్ల నీటి లోతుకు వెళ్లవచ్చు. ఈ నౌకతో సముద్ర వనరులు, జీవవైవిధ్యాన్ని అధ్యయనం చేయవచ్చు.