BJP MP Dilip Ghosh: ఇండియా పేరు మార్పు ఇష్టపడనివాళ్లు దేశం వదిలి వెళ్లిపోవచ్చు : బీజేపీ ఎంపీ దిలీప్‌ ఘోష్‌

ఇండియా పేరును భారత్ గా మారుస్తాను అనే అంశంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో ఇండియా పేరును భారత్ గా మార్చటం ఇష్టపడినవారు దేశం వదిలి వెళ్లిపోవచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత దిలీప్‌ ఘోష్‌.

BJP MP Dilip Ghosh: ఇండియా పేరు మార్పు ఇష్టపడనివాళ్లు దేశం వదిలి వెళ్లిపోవచ్చు : బీజేపీ ఎంపీ దిలీప్‌ ఘోష్‌

BJP MP Dilip Ghosh

Updated On : September 11, 2023 / 12:30 PM IST

BJP MP Dilip Ghosh India name change Bharath : ఇండియా పేరును భారత్ గా మార్చేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం (Modi Govt) సన్నాహాలు చేస్తున్నట్టుగా కనబడుతోంది. దీనిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది సమర్ధిస్తుంటే మరికొంతమంది పేరు మార్చాల్సిన అవసరమేంటి..? అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు దేశ పేరు మార్పుతో దేశ పరిస్థితులు మారతాయా..? అని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు దేశ పేరు మార్చేదానిపై ఉండే శ్రద్ధను దేశంలో పలు అంశాల్లో ఉండే వివక్షను రూపు మాపి అభివృద్ధి ఫలాలు అందరికి అందేలా చేయాలనేదానిపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. ఇలా దేశం పేరు మార్పు విషయంలో దేశ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. విభిన్న అభిప్రాయాలు వస్తున్నాయి.

Church Father : అయ్యప్ప మాల ధరించిన చర్చి ఫాదర్‌, శబరిమల దర్శనం కోసం పదవి వదులుకున్న ఫాదర్

కానీ బీజేపీ నేతలు మాత్రం దేశం మార్పు తథ్యమని..ఇండియా పేరును భారత్ గా మార్చటం ఖాయం అని చెబుతున్నారు. ఈక్రమంలో ఇండియా పేరును భారత్ గా మార్చటం ఇష్టపడినవారు దేశం వదిలి వెళ్లిపోవచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పశ్చిమ బెంగాల్‌ ( West Bengal )బీజేపీ నేత దిలీప్‌ ఘోష్‌ వ్యాఖ్యానించారు. బీజేపీ సీనియర్ నేత (BJP leader Dilip Ghosh), మేదినీపూర్ ఎంపీ దిలీప్ హోష్ ఆదివారం (సెప్టెంబర్ 10,2023) ఖరగ్ పూర్ (Kharagpur)లోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతు..ఇండియా పేరును భారత్ గా మార్చటం ఇష్టంలేనివాళ్లు దేశం వదిలి వెళ్లిపోవచ్చు అంటూ వ్యాఖ్యానించారు. అలాగే పశ్చిమ బెంగాల్‌లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కోల్‌కతాలో ఉన్న విదేశీయుల విగ్రహాలన్నీ తొలగిస్తాం అంటూ ప్రకటించారు.

California : కుల వివక్ష వ్యతిరేక బిల్లుపై సంతకం చేయవద్దంటూ అమెరికాలో నిరసనలు

బీజేపీ నేతల వ్యాఖ్యలు చేస్తున్న వ్యాఖ్యల్ని తృణముల్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ప్రజల దృష్టిని మళ్లించటానికి బీజేపీ ఇటువంటి జిమ్మిక్కులు చేస్తోంది అంటూ విమర్శించారు. భారత్ కూటమికి బీజేపీ భయపడుతోందని అందుకే ప్రజల దృష్టి మరల్చటానికి ఇటువంటి యత్నాలు చేస్తుంది అంటూ మండిపడ్డారు.