Ukraine-Russia War: ‘యుక్రెయిన్‌ కోసం ఆయుధాలు పట్టనున్న ‘బాక్సింగ్‌ లెజెండ్ బ్రదర్స్‌’

'యుక్రెయిన్‌ కోసం ఆయుధాలు పట్టనున్న ‘బాక్సింగ్‌ లెజెండ్ బ్రదర్స్‌' పేరులో వ్లాదిమిర్‌ ఉన్నా ఉక్రెయిన్‌ తరపునే మా పోరాటం అంటున్నారు బాక్సింగ్ లెజెండ్స్ వ్లాదిమిర్, విటాలీ క్లిష్కో

Ukraine-Russia War..Boxing legends Wladimir-Vitali Klitschko Take Arms  : రష్యా-యుక్రెయిన్ యుద్ధం రెండోరోజు భీకరంగా సాగుతోంది. రాజధాని కీవ్ ను మరికొద్ది గంటల్లోనే రష్యా స్వాధీనం చేసుకోబోతోందని తెలుస్తోంది. రష్యా సేనలపై యుక్రెయిన్ సేనలు శక్తికి మించి పోరాడుతున్నా రష్యా సేనల్ని నిలువరించలేకపోతున్నాయి.నాటో రష్యాకు భయపడ్డాయని.. తమను ఒంటరి చేశాయని ఆవేదనగా చెప్పారు యుక్రెయిన్ అధ్యక్షుడు వొదొలిమిర్ జెలెన్ స్కీ. మరోవైపు.. స్వచ్చందంగా.. జనం ఆయుధాలు పట్టి రణరంగంలోకి దిగుతున్న పరిస్థితి నెలకొంది.

Also read :  Russia-Ukraine War Day-2 Live Updates : రాజధానిలోనే ఉంటానన్న జెలెన్‌స్కీ.. గన్స్ పడుతున్న యుక్రెయిన్ జనం

ఇదిలా ఉంటే యుక్రెయిన్ కోసం సామాన్యులు కూడా ఆయుధాలు పట్టి పోరాడుతున్న పరిస్థితి.అలాగే బాక్సింగ్ లెజెండ్స్ వ్లాదిమిర్, విటాలీ క్లిష్కో సోదరులు యుక్రెయిన్ ఏజెంట్లుగా మారి.. రష్యాపై పోరాడటానికి సిద్ధమయ్యారు. ఇద్దరు బాక్సింగ్‌ లెజెండ్స్‌ ప్రస్తుతం ఉక్రెయిన్‌ తరపున రష్యాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. వాళ్లే విటాలి క్లిట్ష్కో, వ్లాదిమిర్ క్లిట్ష్కో.. బాక్సింగ్‌ విభాగంలో ఈ ఇద్దరు అన్నదమ్ములు ఎన్నో ఘనతలు అందుకున్నారు. రష్యా అధ్యక్షుడి పేరును తమ పేరులో ఉన్నా ఉక్రెయిన్ కోసమే పోరాడతామంటున్నారు ఈ బాక్సింగ్ బ్రదర్స్ విటాలి క్లిట్ష్కో, వ్లాదిమిర్ క్లిట్ష్కో..!!

ఎన్నోసార్లు హెవివెయిట్‌ బాక్సింగ్‌లో చాంపియన్‌గా నిలచిన ఈ ఇద్దరు కొంతకాలం కిందట ఉక్రెయిన్‌ ఆర్మీలో తమ పేరును రిజిస్టర్‌ చేసుకున్నారు. ప్రస్తుతం విటాలి క్లిట్ష్కో 2014 నుంచి ఉక్రెయిన్ రాజధాని కైవ్‌కు మేయర్‌గా కొనసాగుతున్నారు.

Also read Ukraine Grandma : ‘నా దేశం యుక్రెయిన్‌ కోసం యుద్ధానికి సిద్ధం’అంటున్న 79 ఏళ్ల బామ్మ..

ఉక్రెయిన్‌ బాంబుల మోతతో దద్దరిల్లడం.. పుతిన్‌ చేస్తున్న రాక్షస క్రీడ బాక్సింగ్ లెజెండ్ బ్రదర్స్ ను తీవ్రంగా కలిచివేసింది. ఈ సందర్భంగా ఈ బాక్సింగ్ సోదురులు ఇద్దరు కలిసి ఓ వీడియోను విడుదల చేశారు. ”దేశాన్ని కాపాడుకోవడం కోసం యుద్ధంలోకి దిగుతున్నాం. పేరులో వ్లాదిమిర్‌ ఉన్నప్పటికి ఉక్రెయిన్‌ తరపునే మా పోరాటం. ఉక్రెయిన్‌ కోసం పోరాడతాం..ఉక్రెయిన్ ను కాపాడుకుంటాం.. మా దేశాన్ని నమ్ముతున్నాం.. ఇక్కడి ప్రజలంతా మా వాళ్లు.. వాళ్లను రక్షించడం మా బాధ్యత.. ఉక్రెయిన్‌ తరపున యుద్ధం చేస్తాం” అంటూ విటాలి క్లిట్ష్కో ఉద్వేగంగా తెలిపారు.

Also read : Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ వార్.. నిరంతర పేలుళ్లు.. 137మంది మృతి

కాగా..రష్యా, ఉక్రెయిన్‌ పై దాడికి పలు దేశాలు ఖండించాయి. పుతిన్ ను యుద్ధం వద్దు అని వారించాయి. అయినా నియంతలా మారిన పుతిన్ మాత్రం తాను అనుకున్నదే చేస్తున్నారు.యుక్రెయిన్ ను అతలాకుతలం చేస్తున్నారు. బాంబుల మోత మోగిస్తున్నారు.ప్రజల్ని భయబ్రాంతుల్ని చేస్తున్నారు. రష్యా సేనలు మూడు వైపులా త్రిశూల వ్యూహంతో యుక్రెయన్ ను హడలెత్తిస్తున్నారు. రష్యా ధాటికి యుక్రెయిన్ నిలువలేకపోతోంది. ఈ యుద్ధం ప్రపంచంలో అశాంతిని రేపింది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత, అంటే దాదాపుగా 40 ఏళ్ల తర్వాత ప్రపంచ దేశాలు చెరి సగంగా విడిపోవడం ఇదే తొలిసారి. కోవిడ్‌–19 వల్ల కలిగిన ఆర్థిక సంక్షోభం నుంచి ఇంకా కోలుకోకుండానే ఇప్పుడు రష్యా యుద్ధం మొదలు పెట్టి మరో అశాంతిని రేకెత్తించింది. రష్యా యుక్రెయిన్ పై యుద్ధం ప్రకటించటం..యుద్ధం చేయటంతో ప్రపంచ దేశాలు ఉలిక్కి పడ్డాయి.

Russia-Ukraine war : యుక్రెయిన్ పై యుద్ధం ఆపాలంటూ డిమాండ్ చేస్తూ రష్యాలో నిరసనలు..వందలాది ఆందోళనకారులను అరెస్ట్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆదేశాలతో మిలటరీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ విభాగాలు ఒకేసారి ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డాయి. ముఖ్యంగా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ బాంబుల మోతతో దద్దరిల్లింది. బాంబుల మోతతో లక్షలాది మంది ఉక్రెయిన్‌ ప్రజలు అండర్‌గ్రౌండ్‌లు, బంకర్లలో తలదాచుకుంటున్నారు. అత్యంత పవర్‌పుల్‌ ఆయుదాలు, మిస్సైల్స్‌ కలిగిన రష్యా బలగాలకు ఎదురెళ్లి ఉక్రెయిన్‌ బలగాలు తమ దేశాన్ని కాపాడుకోవడం కోసం పోరాటం చేస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు