US Covid Cases : అమెరికాలో కోవిడ్ సునామీ..ఒక్కరోజే 10లక్షలకు పైగా కేసులు

అగ్రరాజ్యంలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. కోవిడ్ సునామీ రూపంలో విరుచుకుపడుతోంది. కొత్త వేరియంట్‌ "ఒమిక్రాన్‌" అమెరికన్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గత కొద్ది వారాలుగా రికార్డు

US Covid Cases : అమెరికాలో కోవిడ్ సునామీ..ఒక్కరోజే 10లక్షలకు పైగా కేసులు

Usa2

US Covid Cases : అగ్రరాజ్యంలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. కోవిడ్ సునామీ రూపంలో విరుచుకుపడుతోంది. కొత్త వేరియంట్‌ “ఒమిక్రాన్‌” అమెరికన్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గత కొద్ది వారాలుగా రికార్డులో యూఎస్ లో కోవిడ్ కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా రోజువారీ కోవిడ్ కేసుల్లో అమెరికా ప్రపంచ రికార్డు సృష్టించింది. సోమవారం ఒక్కరోజే అమెరికాలో 10లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

అయితే నాలుగు రోజుల క్రితం యూఎస్ లో 5లక్షల 90వేల కేసులు ఒక్కరోజులో నమోదుకాగా..అదే ఇప్పటివరకు యూఎస్ లో రికార్డుగా ఉండింది. అయితే దీనికి రెట్టింపు సంఖ్యలో సోమవారం 10లక్షలకు పైగా కోవిడ్ కేసులు యూఎస్ లో నమోదయ్యాయి. అయితే నూతన సంవత్సర వేడుకలు, వరుస సెలవులే అగ్రరాజ్యంలో ఈ స్థాయిలో కేసులు పెరగడానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ లెక్కల ప్రకారం 100 మంది అమెరికన్లలో ఒకరు వైరస్‌ బారిన పడ్డారు. అమెరికాలో ఇప్పటివరకు 8.26లక్షలకు పైగా మంది కోవిడ్ తో చనిపోయినట్లు జాన్‌ హాప్కిన్స్‌ డేటా తెలిపింది.

మరోవైపు, కోవిడ్ కేసుల పెరుగుదలతో అమెరికాలో హాస్పిటల్స్ అన్నీ కిక్కిరిసిపోతున్నాయి. 2021 జనవరిలో అత్యధికంగా 1.42లక్షల మంది హాస్పిటల్ పాలవ్వగా.. ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో హాస్పిటల్స్ లో చేరికలు ఉన్నాయి. ప్రస్తుతం అమెరికాలో లక్ష మందికి పైగా హాస్పిటల్స్ లో కోవిడ్ ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇక,కోవిడ్ సునామీ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 62శాతం మంది అమెరికన్లు రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నారు. వీరికి బూస్టర్‌ డోసులను కూడా పంపిణీ చేస్తున్నారు. చిన్నారులకు కూడా కోవిడ్ వ్యాక్సిన్ ను అందిస్తున్నారు.

ALSO READ Manipur Election : భారత వృద్ధిలో ప్రధాన డ్రైవర్లుగా ఈశాన్య రాష్ట్రాలు..మణిపూర్ లో మోదీ