Manipur Election : భారత వృద్ధిలో ప్రధాన డ్రైవర్లుగా ఈశాన్య రాష్ట్రాలు..మణిపూర్ లో మోదీ

మరో రెండు మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించారు. ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మణిపూర్ రాజధాని

Manipur Election : భారత వృద్ధిలో ప్రధాన డ్రైవర్లుగా ఈశాన్య రాష్ట్రాలు..మణిపూర్ లో మోదీ

Modi

Manipur Election :  మరో రెండు మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించారు. ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మణిపూర్ రాజధాని ఇంఫాల్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న మోదీకి..మణిపూర్ సీఎం ఎన్ బీరేన్ సింగ్,ఇతర అధికారులు,నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇంఫాల్​లో రూ.4,815కోట్లు విలువ చేసే పలు అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. 13 ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.

అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ర్యాలీలో మోదీ పాల్గొన్నారు. మోదీ మాట్లాడుతూ..”మణిపూర్ ప్రజల నుంచి ఇవాళ నేను అందుకున్న స్వాగతాన్ని ఎన్నటికీ మర్చిపోను. బీజేపీ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. కొన్నేళ్ల క్రితం వరకు మణిపూర్ లో కేవలం 6శాతం ప్రజలే తమ ఇళ్లల్లో పైప్డ్ వాటర్ ను అందుకునేవాళ్లు. కానీ నేడు జల్ జీవన్ మిషన్ ప్రోగ్రామ్ కింద ఆ నెట్ వర్క్ ను 60శాతానికి పైగా విస్తరించాం. నేడు రాష్ట్రంలో 60శాతానికి పైగా ఇళ్లకు పైప్డ్ వాటర్ కనెక్షన్ ఉంది. తర్వలో ప్రతి ఇళ్లు వాటర్ కనెక్షన్ కలిగి ఉంటుంది. డబుల్ ఇంజిన్ గవర్నమెంట్(కేంద్రంలో-రాష్ట్రంలో అధికారంలో) పవర్ ఇదే.

రాష్ట్రంలో 30లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను ఉచితంగానే ప్రజలకు అందిచడం జరిగింది. మీ(ప్రజలు)ఓటు వల్లనే ఇది సాధ్యమైంది. గతంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు మణిపూర్ పట్ల నిర్లక్ష్యం చూపాయి. 2014లో నేను ప్రధానమంత్రిని అయిన తర్వాత ఢిల్లీని,మొత్తం కేంద్రప్రభుత్వాన్నే మణిపూర్ దగ్గరికి తీసుకొచ్చా. కేంద్రంలో అధికారంలో ఉన్న గత ప్రభుత్వాలు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి ఓ పాలసీని పెట్టుకున్నాయి..”డోంట్ లుక్ ఈస్ట్”అనే పాలసీతో గత ప్రభుత్వాలు పనిచేశాయి.

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 2014లో అధికారంలోకి వచ్చాక యాక్ట్ ఈస్ట్ పాలసీ తీసుకున్నాం. నేను ప్రధాని కాకముందు మణిపూర్ చాలాసార్లు వచ్చాను. మణిపూర్ ప్రజల గుండెల్లో ఉన్న బాధ నాకు తెలుసు. కాబట్టే 2014 తర్వాత మొత్తం కేంద్రప్రభుత్వాన్నే మీ గుమ్మం ముందుకు తీసుకొచ్చా. 21వ శతాబ్దపు ఈ దశాబ్దం మణిపూర్ కి చాలా కీలకం. భారత వృద్ధిలో ఈశాన్య రాష్ట్రాలు ప్రధాన చోదకులుగా మారనున్నాయి”అని మోదీ అన్నారు.

ALSO READ Covid-19 Test: గోవా నుంచి బయల్దేరిన షిప్ లో 66మందికి కొవిడ్ పాజిటివ్