Viral Video: వావ్! హెయిర్ కట్ తర్వాత యువకుడిలా మారిపోయిన హోమ్‌లెస్ మ్యాన్‌.. క్రేజీ వీడియో!

అమెరికాలో హోమ్ లెస్ మ్యాన్‌కు ఒక సెలూన్ షాపు యజమాని ఉచితంగా హెయిర్ కట్, షేవింగ్ చేశాడు. ఇదంతా పూర్తైన తర్వాత హోమ్ లెస్ మ్యాన్‌ కనిపించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Viral Video: వావ్! హెయిర్ కట్ తర్వాత యువకుడిలా మారిపోయిన హోమ్‌లెస్ మ్యాన్‌.. క్రేజీ వీడియో!

Viral Video: సరైన హెయిర్ కట్ చేయించుకుంటే ఎవరైనా కాస్త యంగ్‌గా కనిపించడం మామూలే. కానీ, అదే హెయిర్ కట్ తర్వాత ఒక మిడిల్ ఏజ్ వ్యక్తి యంగ్‌గా మారడం ఎప్పుడైనా చూశారా? లేదు కదూ! అయితే, ఈ వీడియో చూడండి. వావ్ అంటారు.

Viral Video: డ్రైవింగ్ సీట్లో కూర్చోకుండానే స్టీరింగ్ తిప్పి ట్రక్కు పార్కింగ్ చేసిన డ్రైవర్.. వైరల్ అవుతున్న వీడియో

అమెరికాలో హోమ్ లెస్ పీపుల్ చాలా మందే ఉంటారు. అంటే వాళ్లకు ఇల్లు, ఆస్తులు వంటివి ఉండవు. వీధుల్లోనే చిన్న టెంట్లలో జీవిస్తూ ఉంటారు. వాళ్లకు ప్రభుత్వమే కనీస అవసరాలు తీరుస్తుంటుంది. వీళ్లలో చాలా మంది తమ వస్త్రధారణ, ఆహార్యం గురించి ఆలోచించరు. అంటే జట్టు, గడ్డం పెంచుకుని, మాసిన బట్టలతో జీవిస్తారు. కానీ, వాలాంటి వాళ్లు అందరిలా ఆహార్యంపై దృష్టిపెడితే చాలా బాగుంటారు. దీనికి ఉదాహరణ ఈ వీడియో. అమెరికాలో ఒక సెలూన్ షాపు యజమాని రెగ్యులర్‌గా హోమ్ లెస్ పీపుల్‌కు ఉచితంగా హెయిర్ కట్ చేస్తుంటాడు. దానికి సంబంధించిన వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటాడు. తాజాగా అతడు పోస్ట్ చేసిన ఒక వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Arvind Kejriwal: గుజరాత్ ఎన్నికలు.. యోగి ఆదిత్యానాథ్‌కు కేజ్రీవాల్ కౌంటర్

ఆ వీడియో ప్రకారం.. ఒక హోమ్ లెస్ మ్యాన్ తనకు హెయిర్ కట్ చేయమని ఆ సెలూన్‌కు వెళ్లాడు. దీంతో యజమాని అతడికి హెయిర్ కటింగ్, షేవింగ్ చేశాడు. తర్వాత చూస్తే ఆ హోమ్ లెస్ మ్యాన్ చాలా యంగ్‌గా కనిపించాడు. కనీసం 20 ఏళ్ల వయసు తగ్గినంత యంగ్‌గా కనిపిస్తున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కావాలంటే ఆ క్రేజీ వీడియో మీరూ చూడండి.