Viral Video: డ్రైవింగ్ సీట్లో కూర్చోకుండానే స్టీరింగ్ తిప్పి ట్రక్కు పార్కింగ్ చేసిన డ్రైవర్.. వైరల్ అవుతున్న వీడియో

ట్రక్కులాంటి భారీ వాహనాన్ని చాలా జాగ్రత్తగా నడపాలి. అందులోనూ రివర్స్ వెళ్లాలంటే డ్రైవర్ ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కానీ, ఒక డ్రైవర్ మాత్రం ట్రక్కు ఎక్కకుండానే, బయటి నుంచే దాన్ని పార్క్ చేశాడు.

Viral Video: డ్రైవింగ్ సీట్లో కూర్చోకుండానే స్టీరింగ్ తిప్పి ట్రక్కు పార్కింగ్ చేసిన డ్రైవర్.. వైరల్ అవుతున్న వీడియో

Viral Video: ఫోర్ వీలర్ వాహనాన్ని నడపాలంటే కచ్చితంగా డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉండాల్సిందే. అప్పుడే గేర్ మార్చడం, స్టీరింగ్ తిప్పడంతోపాటు, బ్రేక్స్, క్లచ్ వంటివి వాడొచ్చు. అందులోనూ హెవీ వెహికల్స్ నడపాలంటే కచ్చితంగా డ్రైవింగ్ సీట్లో ఉండాల్సిందే.

Viral Video: బైకుపై పారిపోతున్న దొంగను పట్టుకునేందుకు కానిస్టేబుల్ సాహసం… వైరల్ అవుతున్న వీడియో

కానీ, ఒక వ్యక్తి మాత్రం ట్రక్కులోకి ఎక్కకుండానే ఏకంగా 18 చక్రాలున్న భారీ ట్రక్కును నడిపాడు. నిలబడి, హ్యాండిల్ పట్టుకుని సైకిల్ తిప్పినంత ఈజీగా ట్రక్కును డ్రైవ్ చేశాడు. ట్రక్కు బయట డ్రైవింగ్ సీట్ పక్కన నిలబడి కింది నుంచే స్టీరింగ్ తిప్పాడు. అంతేకాదు… అలా నడుస్తూనే ట్రక్కును రివర్స్ చేసి, పార్కింగ్ చేశాడు. అంత భారీ వాహనాన్ని బయటి నుంచే అతడు పార్కింగ్ చేసిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇప్పటికే ఈ వీడియోకు 4.7 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అయితే, ఈ వీడియో ఎక్కడ తీశారో సమాచారం లేదు. కావాలంటే ఈ వీడియో మీరూ చూడండి.