woman viral video : చీరకట్టుతో రోమ్ వీధుల్లో తిరిగిన భారతీయ మహిళ.. మంత్రముగ్ధులైన ఇటాలియన్లు

చీరకట్టుతో రోమ్ వీధుల్లో నడిచింది ఓ భారతీయ మహిళ. పాశ్యాత్య వేషధారణల మధ్య చీరకట్టుతో మెరిసింది. ఇక ఆమెను చూసేందుకు, ఫోటోలు తీసేందుకు ఇటాలియన్లు ఎగబడ్డారు. నెటిజన్లు సైతం ఫిదా అయిపోయారు.

woman viral video : చీరకట్టుతో రోమ్ వీధుల్లో తిరిగిన భారతీయ మహిళ.. మంత్రముగ్ధులైన ఇటాలియన్లు

woman viral video

woman viral video : చీరకట్టుతో రోమ్ నగర వాసుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది ఓ భారతీయ మహిళ. ఎక్కడ ఉన్నా మన దేశ మూలాలు మర్చిపోమని చాటి చెప్పిన ఆమెను అందరు ప్రశంసిస్తున్నారు.

Anything with Saree : చీరకట్టుతో ఎక్సర్ సైజ్, జిమ్నాస్టిక్స్, ఫుట్ బాల్.. ఏదైనా సాధ్యమంటున్న మహిళలు

ఫేమస్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్ పల్లవిరాజ్ రోమ్ వాసుల్ని తన చీరకట్టుతో మెస్మరైజ్ చేశారు. భారతీయ సంప్రదాయ చీరకట్టుతో రోమ్ వీధుల్లో తిరిగారు. ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపించిన ఆమె వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. పల్లవి తన మొదటి వివాహ వార్షికోత్సవాన్ని భారతీయ సంప్రదాయాల్ని గుర్తు చేసేలా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నారు. అద్భుతమైన గులాబీ, బంగారు రంగు చీర ధరించి రోమ్ వీధుల్లో వాక్ చేశారు. సందడిగా ఉండే రోమ్ వీధుల్లో స్ధానికులు, పర్యాటకుల దృష్టిని ఆకర్షించి అందరి ప్రశంసలు పొందారు.

Woman doing gym in saree : చీరకట్టుతో జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నమహిళ వీడియో వైరల్

myshadowbeats అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేరైన వీడియోలో పల్లవి తన చీర కట్టులో ఆత్మవిశ్వాసంతో నడుస్తూ కనిపించారు. అక్కడ కనిపించేవారికి భిన్నంగా కనిపించిన పల్లవి వస్త్రధారణ అందరినీ ఆకర్షించింది. ఆమెను ప్రత్యేకంగా నిలిపింది. ‘ నేను చీర కట్టుకుంటే ఇటాలియన్ ప్రజలు ఎలా స్పందించారంటే… నా మొదటి వివాహ వార్షికోత్సవానికి చీర కట్టుకుని రోమ్ వీధుల్లో నడుస్తుంటే ఇటాలియన్ ప్రజల స్పందన తెలుసుకోవాలనుకున్నాను. నిజం చెప్పాలంటే చాలా అందంగా ఫీలవుతున్నాను’ అనే శీర్షికతో పల్లవి ఈ పోస్ట్‌ను ట్యాగ్ చేశారు. పల్లవి చీరకట్టులో నడుస్తుంటే ఇటాలియన్లు చప్పట్లు కొట్టారు. ఫోటోలు తీయడానికి ఎగబడ్డారు. సోషల్ మీడియాలో సైతం ఈ వీడియో అందరి మన్ననలు పొందింది.

 

View this post on Instagram

 

A post shared by Pallavi Raj (@myshadowbeats)