Woman doing gym in saree : చీరకట్టుతో జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నమహిళ వీడియో వైరల్
ఒకప్పుడు చీరతో ఏ పని చేయాలన్నా కష్టం అనే మహిళలంతా ఇప్పుడు చీరకట్టుతో బ్రేక్ డ్యాన్సులు చేస్తున్నారు. చీరకట్టుతో జిమ్‌లో వర్కౌట్లు చేసేస్తున్నారు. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న వీడియో చూడండి.

Woman doing gym in saree
Viral Video : చీరకట్టుతో మహిళ జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
Woman break dance in saree : చీరకట్టుతో.. హైహీల్స్‌తో బ్రేక్ డ్యాన్స్ ఇరగదీసిన మహిళ వీడియో వైరల్
రీనా సింగ్.. ఫిట్‌నెస్ మీద ఆసక్తి ఉన్న మహిళ. చీర కట్టుకుని జిమ్‌లో వ్యాయామం చేయడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే చీరకట్టుతో ఏ పని చేయాలన్నా ఇబ్బంది పడిపోతాం అనే మహిళలకు భిన్నంగా రీనా సింగ్ చీరతో జిమ్ చేయడం నిజంగానే ఆశ్చర్యంగా ఉంది. చీరలో ప్రత్యేకంగా కనబడుతూ రీనా జిమ్ చేస్తుంటే ఫిట్‌నెస్ పట్ల ఆమెకి ఉన్న అంకిత భావం కనిపిస్తోంది. ఫిటినెస్ పట్ల ఆసక్తి.. సంప్రదాయాన్ని గౌరవిస్తూ చీర ధరించడం రెండు సవాలుగా ఆమె సామర్థ్యాన్ని ప్రతిబింబించాయి. పాత పద్ధతులకు తెరవేస్తూ తన వ్యక్తిత్వాన్ని గౌరవించుకుంటూ ఇష్టానికి పరిమితులు లేవని ఈ వీడియోలో రీనా చెప్పకనే చెబుతోంది.
Bengaluru : ఐదుగురి ప్రాణాలు కాపాడటానికి ఆమె చీర తీసి ఇచ్చేసింది .. మహిళ తెగువకు హ్యాట్యాఫ్..
చీర కట్టుకుంటే ఏ పనీ చేయలేమనుకునే మహిళలకు ఈ వీడియో ఎలాంటి సవాల్‌ను అయినా జయించవచ్చని నిరూపించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో reenasinghfitness పేరుతో షేరైన ఈ వీడియోపై నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ‘వావ్.. అద్భుతంగా ఉంది’ అని ఒకరు పొగిడితే .. ‘సరైన జిమ్ దుస్తులు లేకుండా రీనా గాయపడే ప్రమాదం ఉందా?’ అని మరొకరు ప్రశ్నించారు. చీరతో ఆమె వర్కౌట్లు చేస్తుంటే ఇంతకుముందు ఇలా చేసిన అనుభవం ఉందనిపిస్తోంది. ఏది ఏమైనా చీర కట్టుతో జిమ్ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తోంది.
View this post on Instagram