Bengaluru : ఐదుగురి ప్రాణాలు కాపాడటానికి ఆమె చీర తీసి ఇచ్చేసింది .. మహిళ తెగువకు హ్యాట్యాఫ్..

ఆదివారం బెంగళూరులో కురిసిన భారీ వర్షం భీభత్సాన్ని సృష్టించింది. అండర్ పాస్‌లో చిక్కుకున్న 5 గురిని రక్షించడానికి ఓ స్త్రీ సాహసం చేసింది. తను తీసి ఇచ్చిన చీర సాయంతో వారి ప్రాణాలు కాపాడగలిగారు. ఆ మహిళ తెగువను అందరూ మెచ్చుకుంటున్నారు.

Bengaluru : ఐదుగురి ప్రాణాలు కాపాడటానికి ఆమె చీర తీసి ఇచ్చేసింది .. మహిళ తెగువకు హ్యాట్యాఫ్..

Bengaluru

Bengaluru – woman’s saree saved 5 lives : ప్రాణాపాయంలో ఉన్నవారికి డబ్బులు కావాలంటే ఇస్తారు.. ఏవైనా వస్తువులు కావాలంటే ఇస్తారు.. కానీ ఓ మహిళ తన ఒంటిపై ఉన్న చీర తీసి ఇచ్చింది. ఆ చీర ఐదుగురి ప్రాణాలు కాపాడింది.

Bengaluru rains: వర్ష బీభత్సం.. కారులో చిక్కుకుని ఏపీ మహిళ మృతి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా గుర్తింపు

భారీ వర్షాలకు బెంగళూరు అతలాకుతం అయ్యింది. ఆదివారం కురిసిన వర్షానికి కేఆర్ సర్కిల్ కి దగ్గరలో ఉన్న అండర్ పాస్ లో నీరు పొంగి పొర్లింది. ఆ నీటిలో ఆరుగురు చిక్కుకుపోగా వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భానురేఖ అనే టెకీ చనిపోయింది. ఇక మిగిలిన ఐదుగురిని బీబీఎంపి రక్షణ బృందాలు కాపాడాయి. అయితే వారి ప్రాణాలకు కాపాడటానికి సాయపడింది ఓ మహిళ ధరించిన చీర.

Bengaluru : ట్రాఫిక్ జామ్‌లో కూడా బైక్ మీద కూర్చుని ల్యాప్ టాప్‌లో పని చేసుకుంటున్న మహిళ..

అండర్ పాస్‌ నీటితో నిడిపోవడంతో మునిగిపోతున్న కారులో చిక్కుకున్న వారిని కాపాడటానికి తాడు అవసరమైంది. అక్కడే ఉన్న మహిళ ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా తన చీరను విప్పి వారికి ఇచ్చింది. అండర్ పాస్‌కి ఉన్న ఇనుప ఊచలకు చీరను కట్టడంతో దాని సాయంతో వరుసగా అందరూ బయటకు వచ్చారు. ప్రమాదంలో చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడటానికి చీర ఇచ్చిన మహిళ ధైర్యాన్ని అందరూ మెచ్చుకున్నారు. ఇక ఆమెకు మరో మహిళ చున్నీని, ఇంకో వ్యక్తి చొక్కాను ఇచ్చారు. మొత్తానికి ఆమె చీర ఐదుగురి ప్రాణాలను కాపాడింది.

Also Read: పాపం భానురేఖ.. బెంగళూరులో అడుగుపెట్టిన రోజే అకాల మరణం.. ఆస్పత్రి నిర్లక్ష్యమే కారణమా..?