Sarkaru Vaari Paata: 105 షాట్స్ ఆఫ్ ట్రైలర్.. సూపర్ స్టార్ మెంటల్ మాస్ స్వాగ్ రెడీ

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మనకు కనిపిస్తుండటంతో ఈ మూవీని..

Sarkaru Vaari Paata: 105 షాట్స్ ఆఫ్ ట్రైలర్.. సూపర్ స్టార్ మెంటల్ మాస్ స్వాగ్ రెడీ

Sarkaru Vaari Paata

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మనకు కనిపిస్తుండటంతో ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఈ చిత్రంపై అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేయగా, ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమాలోని పాటలు ఆ అంచనాలను రెట్టింపు చేశాయి.

Sarkaru Vaari Paata: పెరిగిన ఎస్‌వీపీ ప్రమోషన్ స్పీడ్.. ఇక మాస్ జాతరే

సమ్మర్ ట్రీట్‌గా రాబోతున్న ఈ సినిమాను మే 12న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను స్పీడ్ పెంచేసిన ఎస్వీపీ టీం రేపు మే 2న ట్రైలర్ రిలీజ్ చేయనుంది. అయితే.. అంతకు ముందే ఈరోజే ట్రైలర్ షాట్స్ పేరుతో మరో వీడియోను కూడా రిలీజ్ చేశారు. మొత్తం 105 షాట్స్ ట్రైలర్ లో ఉంటాయంటూ తాజాగా విడుదల చేసిన వీడియోలో శాంపిల్ చూపించిన మేకర్స్.. సూపర్ స్టార్ మెంటల్ మాస్ స్వాగ్ చూసేందుకు రెడీగా ఉండండంటూ హిట్ ఇచ్చేశారు.

Sarkaru Vaari Paata: ట్రైలర్‌లోనే క్లారిటీ ఇస్తానంటోన్న మహేష్!

రేపు మే 2న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టు టైం కూడా అనౌన్స్ చేసిన మేకర్స్ చిన్న మాస్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియోను చూస్తే మరోసారి థమన్ బీజీఎంతో మ్యాజిక్ చేసినట్లే కనిపిస్తుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించగా మహేష్ జంటగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే పాటలు టీజర్ తో హంగామా సృష్టిస్తున్న ఫ్యాన్స్ ఇక మాస్ స్వాగ్ ట్రైలర్ కూడా వస్తే ఆగుతారో లేదో!