18 Pages : మొదటి రోజే బ్రేక్ ఈవెన్ కొట్టేసిన నిఖిల్.. 18 పేజెస్ సూపర్ హిట్..

అందరూ భావించినట్టే నిఖిల్, అనుపమ 18 పేజెస్ సినిమా మంచి విజయం సాధించింది. అయితే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ మొదటి రోజే బ్రేక్ ఈవెన్ అయింది ఈ సినిమా. మొదటి రోజే దాదాపు..................

18 Pages : మొదటి రోజే బ్రేక్ ఈవెన్ కొట్టేసిన నిఖిల్.. 18 పేజెస్ సూపర్ హిట్..

18 Pages movie done break even in first day

18 Pages :  నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ కలిసి జంటగా ఇటీవల కార్తికేయ 2 సినిమాతో భారీ హిట్ కొట్టి ఏకంగా 100 కోట్ల కలెక్షన్స్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సారి ఇదే జంట ’18 పేజెస్’ సినిమాతో వచ్చారు. 18 పేజెస్ సినిమాకి సుకుమార్ కథ అందించగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో GA2 బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ కలిపి సినిమాని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకి థియేటర్స్ లోకి వచ్చింది.

కార్తికేయ 2తో 100 కోట్లు సాధించడంతో నిఖిల్ 18 పేజెస్ సినిమాకి భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని భావించినా ఇది కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ చేయడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ మామూలుగానే జరిగింది. నిఖిల్ 18 పేజెస్ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో 13 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధిస్తే బ్రేక్ ఈవెన్ అయి సినిమా హిట్ అవుతుంది. అయితే ప్రస్తుతం నిఖిల్ కి ఉన్న క్రేజ్ కి, అనుపమ ఫ్యాన్ ఫాలోయింగ్ కి ఇది చిన్న టార్గెట్. దీంతో చిత్రయూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

18 Pages Movie Review : కొత్త కథనంతో.. అదరగొట్టేసిన నిఖిల్, అనుపమ.. 18 పేజెస్ రివ్యూ..

అందరూ భావించినట్టే నిఖిల్, అనుపమ 18 పేజెస్ సినిమా మంచి విజయం సాధించింది. అయితే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ మొదటి రోజే బ్రేక్ ఈవెన్ అయింది ఈ సినిమా. మొదటి రోజే దాదాపు 20 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్టు సమాచారం. చిత్ర యూనిట్ అధికారికంగా 18 పేజెస్ సినిమా మొదటి రోజే బ్రేక్ ఈవెన్ అయిందని ప్రకటించారు. సినిమాని నిర్మాతలే డైరెక్ట్ రిలీజ్ చేయడంతో మొదటి రోజే బ్రేక్ ఈవెన్ అయింది. దీంతో ఈ వారాంతంలో సినిమా ఫుల్ లాభాల్లో ఉంటుందని అంటున్నారు. సినిమా బాగుంది అని టాక్ కూడా రావడంతో కలెక్షన్స్ కూడా బాగానే వస్తాయని అంటున్నారు. దీంతో నిఖిల్ మరో హిట్ కొట్టేసాడు. మరి లాంగ్ రన్ లో 18 పేజెస్ సినిమా మొత్తం ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.