18 Pages Movie Review : కొత్త కథనంతో.. అదరగొట్టేసిన నిఖిల్, అనుపమ.. 18 పేజెస్ రివ్యూ..

మరోసారి నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ కలిసి జంటగా '18 పేజెస్' సినిమాతో వచ్చారు. 18 పేజెస్ సినిమాకి సుకుమార్ కథ అందించగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో GA2 బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ కలిపి సినిమాని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 23న............

18 Pages Movie Review : కొత్త కథనంతో.. అదరగొట్టేసిన నిఖిల్, అనుపమ.. 18 పేజెస్ రివ్యూ..

18 Pages Movie Review

18 Pages Movie Review :  నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ కలిసి కొన్ని రోజుల క్రితమే కార్తికేయ 2 సినిమాతో వచ్చి ప్రేక్షకులని మెప్పించి పాన్ ఇండియా లెవల్లో భారీ హిట్ కొట్టి ఏకంగా 100 కోట్ల కలెక్షన్స్ సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. మరోసారి నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ కలిసి జంటగా ’18 పేజెస్’ సినిమాతో వచ్చారు. 18 పేజెస్ సినిమాకి సుకుమార్ కథ అందించగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో GA2 బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ కలిపి సినిమాని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకి థియేటర్స్ లోకి వచ్చింది.

సినిమా ట్రైలర్, పాటలు రిలీజ్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. సినిమా ప్రేక్షకుల అంచనాలని అందుకుందనే చెప్పొచ్చు. కథ విషయానికొస్తే హీరో ఒక యాప్ డెవలపర్. హీరోని ఒక అమ్మాయి చీట్ చేయడంతో అతని బ్రేకప్ కథతో సినిమా స్టార్ట్ అవుతుంది. బ్రేకప్ బాధలో ఓ పాట వస్తుంది. ఆ పాటలో హీరోకి అనుకోకుండా రోడ్డు మీద రెండేళ్ల క్రిందటి డైరీ ఒకటి దొరుకుతుంది. బ్రేకప్ బాధలో ఉన్నప్పుడు ఆ డైరీ చదువుతూ అందులో హీరోయిన్ రాసిన దానికి కనెక్ట్ అవుతాడు. అందులో రాసిన ప్రతిదీ అప్పుడే జరుగుతున్నట్టు ఫీల్ అయి ఓవర్ గా రియాక్ట్ అవుతాడు.

అలా ఆ డైరీలో ఉన్నవి చదువుతూ అది రాసిన అమ్మాయితో ప్రేమలో పడతాడు హీరో. అయితే ఆ డైరీ 18 పేజీలతో ఆగిపోవడంతో తర్వాత ఏమైంది అని హీరోయిన్ కోసం వెతకడం మొదలుపెడతాడు. హీరోయిన్ కోసం వెతకడం మొదలుపెట్టాక షాకింగ్ నిజాలు, ట్విస్ట్ లు బయటకి వస్తాయి. దీంతో హీరో షాక్ అయి ఆ అమ్మాయి కోసం ఏం చేశాడు? హీరోయిన్ ని కలిశాడా లేదా అన్నదే కథ.

కథ చాలా సింపుల్ లైన్. అవతలి వ్యక్తి ఎవరో తెలియకుండానే ప్రేమలో పడి వాళ్ళ కోసం వెతకడం అనేది చాలా సినిమాల్లో గతంలో చూశాం. అయితే ఈ సినిమాలో కథ పాతదే అయినా దర్శకుడు కథనాన్ని కొత్తగా నడిపించాడు. మొదటి హాఫ్ మొత్తం ప్రేక్షకులని ఫుల్ గా నవ్వించి ఇంటర్వెల్ లో ట్విస్ట్ లు ఇచ్చి సెకండ్ హాఫ్ లో కథకి కొన్ని కమర్షియల్ అంశాలని జోడించి చాలా మరింత ఆసక్తిగా చేశాడు. సినిమాలో వచ్చే కొన్ని ట్విస్ట్ లని ఆడియన్స్ అర్ధం చేసుకోగలరు. సినిమా అంతా బాగా నడిపించి చివర్లో కొన్ని లాజిక్ లెస్ సీన్స్ రావడంతో ప్రేక్షకులు కొద్దిపాటి అసహనానికి గురవుతారు. అయినా క్లైమాక్స్ ఒక మంచి ఎమోషనల్ షాట్ తో క్లోజ్ చేస్తారు.

Anasuya : అనసూయని అంతగా హర్ట్ చేసింది ఎవరో..

సినిమా మొత్తం మీద ఒక్కసారి కూడా హీరో, హీరోయిన్ కలవడం కానీ, వాళ్ళ మధ్య మాటలు, మాట్లాడుకోవడం లాంటివి ఉండకపోవడం విశేషం. అనుపమ, నిఖిల్ లు సినిమాకి చాలా ప్లస్. సినిమాని వాళ్ళ భుజాలపై వేసుకొని వీళ్ళిద్దరే నడిపించారు. ఈ ఇద్దరూ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసారు. అనుపమ క్యారెక్టర్ అయితే చాలా మందికి నచ్చుతుంది. అనుపమ తెరపై కనిపించిన ప్రతిసారి ఒక ఫీల్ గుడ్ వైబ్ వస్తుంది. నిఖిల్ ఫ్రెండ్ గా యూట్యూబర్ సరయు కూడా బాగా చేసింది. ఈ సినిమాలో సరయుకి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పడింది. దీంతో సరయూకి మరిన్ని అవకాశాలు కచ్చితంగా వస్తాయి. సినిమాలో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే అంశాలు చాలానే ఉన్నాయి. గోపి సుందర్ మ్యూజిక్, BGM సినిమాకి చాలా ప్లస్ అయింది. 18 పేజెస్ సినిమాలో అంతర్లీనంగా మొబైల్స్ పక్కన పెట్టి సమాజంలో మనుషులతో కలవండి అనే ఒక మంచి సందేశాన్ని కూడా ఇచ్చారు. మొత్తంగా నిఖిల్ మరో హిట్ కొట్టేసినట్టే.