Nikhil : 18వ తారీఖు సుకుమార్ రాసిన ’18 పేజీలు’

 యంగ్ హీరో నిఖిల్ జయాపజయాలతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కొత్త కథలను ట్రై చేస్తున్నాడు. తాజాగా మరో కొత్త కథతో రాబోతున్నాడు నిఖిల్. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ రాసిన క‌థ‌తో ప‌ల్నాటి

Nikhil : 18వ తారీఖు సుకుమార్ రాసిన ’18 పేజీలు’

18 Pages

Nikhil :  యంగ్ హీరో నిఖిల్ జయాపజయాలతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కొత్త కథలను ట్రై చేస్తున్నాడు. తాజాగా మరో కొత్త కథతో రాబోతున్నాడు నిఖిల్. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ రాసిన క‌థ‌తో ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ ద‌ర్శ‌కత్వంలో నిఖిల్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా సినిమా రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ’18 పేజీస్’ అని అనౌన్స్ చేశారు. టైటిల్ చాలా కొత్తగా ఉండటమే కాక, సుకుమార్ రాసిన కథ కావడంతో ఈ సినిమా కోసం సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని జీఏ2పిక్చ‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్నారు.

Bigg Boss 5 : నిన్న దీప్తి.. ఇవాళ జ్యోతి.. సన్నీపై ఫైర్ అవుతున్న మాజీ కంటెస్టెంట్స్

ఇప్ప‌టికే విడుద‌లైన ’18 పేజీస్’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్లకు మంచి స్పందన లభించింది. ఇటీవల వాయిదా పడ్డ సినిమాల రిలీజ్ డేట్స్ అన్ని వరుసగా అనౌన్స్ చేస్తున్నారు. ఇదే కోవలో తాజాగా 18 పేజీస్ విడుద‌ల తేదిని కూడా ప్రకటించారు. ఈ సినిమాని ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 18, 2022న థియేటర్లలో విడుద‌ల చేయబోతున్నట్టు ప్రకటించారు చిత్ర బృందం.

Sudigali Sudheer : అభిమానులకి షాక్.. జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ అవుట్??

రిలీజ్ డేట్ తో పాటు మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సుకుమార్ రాసిన కథ అవ్వడంతో నిఖిల్ అభిమానులతో పాటు, సుకుమార్ ఫ్యాన్స్ కూడా సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి టైటిల్ కి సెట్ అయ్యేలా ’18 పేజీస్’ సినిమా 18వ తారీఖుని రిలీజ్ చేయడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇప్పటికే ఫిబ్రవరిలో ‘ఆచార్య’, ‘మేజర్’, ‘ఖిలాడీ’, ‘ఎఫ్ 3’ లాంటి సినిమాలు రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేశాయి.