Bigg Boss 5 : నిన్న దీప్తి.. ఇవాళ జ్యోతి.. సన్నీపై ఫైర్ అవుతున్న మాజీ కంటెస్టెంట్స్

తాజాగా మరో మాజీ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ శివజ్యోతి కూడా షన్నుకి మద్దతుగా పోస్ట్ చేసింది. దీప్తి సునయన పెట్టిన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీని షేర్‌ చేస్తూ.. ఆడవాళ్లని అడ్డం పెట్టుకుని ఆడటం

Bigg Boss 5 : నిన్న దీప్తి.. ఇవాళ జ్యోతి.. సన్నీపై ఫైర్ అవుతున్న మాజీ కంటెస్టెంట్స్

Shannu Sunny

Bigg Boss 5 :  గత సీజన్ల కంటే ఈ సీజన్ బిగ్ బాస్ లో ఎక్కువగా గొడవలే జరుగుతున్నాయి. గొడవలు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ తక్కువ అని షో చూస్తున్న ఎవరికైనా తెలుస్తుంది. ఇక హౌస్ లో సన్నీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అవసరం ఉన్నా లేకపోయినా ఆవేశపడి గొడవలకు దిగుతాడు. అందరి పై అరుస్తాడు. ఈ విషయంలో నాగార్జున వార్నింగ్ ఇచ్చినా కొన్ని రోజులు సైలెంట్ గా ఉండి మళ్ళీ అలాగే బిహేవ్ చేస్తున్నాడు. నిన్నటి ఎపిసోడ్ లో కూడా మరోసారి నాగార్జున సన్నీ మీద ఫైర్ అయ్యారు. సన్నీ తాను మారకుండా వేరే వాళ్ళతో గొడవలు పడుతూ వేరే వాళ్ళని బ్యాడ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాడు మొదటి నుంచి.

RRR : సినిమా టికెట్ ధరలపై ఏపీ సీఎంని కలవనున్న ‘ఆర్ఆర్ఆర్’ టీం

మొన్న బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్‌లో సన్నీ సిరిని ఇష్టమొచ్చిన మాటలు అన్నాడు. దీంతో సిరి ఫ్రెండ్ అయిన షణ్ను మధ్యలో రావడంతో వీళ్ళ ఇద్దరి మధ్య గొడవ ఇంకా ఎక్కువ అయింది. సన్నీ షణ్నుని కూడా అనరాని మాటలు అన్నాడు. కొడతాను, తంతాను, అప్పడం చేస్తాను, ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని ఆడతావు, నువ్వు యూట్యూబ్ వరకే.. అంటూ చులకనగా చూస్తూ ఇలా చాలా మాటలు అన్నాడు. మొదట్లో షణ్ను మాములుగా తీసుకున్నా సన్నీ రెచ్చిపోవడంతో షణ్ను కూడా తన కోపం చూపించాడు.

Sudigali Sudheer : అభిమానులకి షాక్.. జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ అవుట్??

అయితే ఈ గొడవపై నిన్న షణ్ను గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునైనా ఇంస్టాగ్రామ్ లో సన్నీని ఏకిపారేసింది. సన్నీని ఉద్దేశించి దీప్తి సునయన తీవ్రంగా వ్యాఖ్యలు చేసింది. సపోర్ట్‌గా నిల్చుంటే ఆడవాళ్లను అడ్డు పెట్టుకుని గేమ్‌ ఆడినట్లా?, మరి నీకు కాజల్‌ సపోర్ట్‌ చేసినప్పుడు ఏమైంది?, యూట్యూబ్‌ వరకే అంటే దాని అర్ధం ఏంటి?, షన్ను ఎంతో కష్టపడి ఈ స్టేజ్‌ వరకు వచ్చాడని సంతోషించకుండా ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడటం తప్పని సన్నీ మీద ఓ రేంజ్ లో ఫైర్ అయింది దీప్తి.

Bigg Boss 5 : హౌస్ నుంచి జెస్సి అవుట్.. ఈ సారి కన్ఫర్మ్..

తాజాగా మరో మాజీ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ శివజ్యోతి కూడా షన్నుకి మద్దతుగా పోస్ట్ చేసింది. దీప్తి సునయన పెట్టిన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీని షేర్‌ చేస్తూ.. ఆడవాళ్లని అడ్డం పెట్టుకుని ఆడటం అంటే? ఒకసారి మీరు కెప్టెన్‌ అవడానికి యానీ మాస్టర్‌ సపోర్ట్‌ చేశారు. ఇది లేడీ కార్డ్‌ వాడటం కాదా? గుర్తు తెచ్చుకోండి. హౌస్‌ బయట కాదు, హౌస్‌ లోపల హెల్తీ గేమ్‌ ఆడండి, మీరు మీ ఫ్రెండ్స్‌తో గేమ్‌ ఆడొచ్చు, మీ ఫ్రెండ్‌ మిమ్మల్ని సేవ్‌ చేయకపోతే అలగొచ్చు, ఏంటో మరి.. అని సన్నీకి గట్టిగా కౌంటర్ వేసింది. వేరే సెలబ్రిటీలు కూడా షణ్ణుకి సపోర్ట్ గా పోస్టులు చేస్తున్నారు. సోషల్ మీడియాలో షన్ను ఫాన్స్ మాత్రమే కాక వేరే వాళ్ళు కూడా సన్నీని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే తర్వాత ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ గొడవ ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి మరి. ట్విట్టర్ లో ఈ గొడవ మీద ట్రెండ్ కూడా నడవడం విశేషం.