RRR : సినిమా టికెట్ ధరలపై ఏపీ సీఎంని కలవనున్న ‘ఆర్ఆర్ఆర్’ టీం

ఏపీ సినిమా టికెట్ ధరలపై 'ఆర్ఆర్ఆర్' చిత్ర యూనిట్ కోర్టును ఆశ్రయించబోతున్నారు అనే వార్తలు వచ్చాయి. తాజాగా 'ఆర్ఆర్ఆర్' చిత్ర నిర్మాత దానయ్య ఈ వార్తలపై స్పందించారు. ఈ వివాదంపై దానయ్య

RRR : సినిమా టికెట్ ధరలపై ఏపీ సీఎంని కలవనున్న ‘ఆర్ఆర్ఆర్’ టీం

Rrr Producer

RRR :  ఏపీలో గత కొన్ని నెలలుగా థియేటర్ సమస్యలు, టికెట్ రేట్లపై చర్చలు, ఆన్లైన్ టికెటింగ్ అంటూ చర్చలు జరుగుతున్నాయి. సినీ పరిశ్రమ నుంచి ఇప్పటికే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ మంత్రి పేర్ని నాని ని కలిసి వారి సమస్యల్ని వివరించారు. థియేటర్స్ ని పూర్తిగా ఓపెన్ చేసినప్పటికీ టికెట్ ధరలపై ఇంకా చర్చలు నడుస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లు తగ్గించి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఆన్లైన్ టికెటింగ్ జరపాలని చూస్తుంది. ఇదే జరిగితే సినిమా వసూళ్లు తగ్గడమే కాక, నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలే మిగులుతాయి. దీనిపై ఇప్పటికే సినీ ప్రముఖులతో చర్చలు జరిపారు.

Sudigali Sudheer : అభిమానులకి షాక్.. జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ అవుట్??

సినీ పరిశ్రమ నుంచి ఆన్లైన్ టికెటింగ్ కి ఓకే చెప్పినా టికెట్ రేట్లు మాత్రం తగ్గించొద్దు అంటున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. జనవరిలో సంక్రాంతి కానుకగా ‘ఆర్ఆర్ఆర్’తో పాటు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. టికెట్ రేట్లు తగ్గిస్తే వాటికి పెట్టిన బడ్జెట్ కూడా వస్తుందో లేదో అనుమానం. ‘ఆర్ఆర్ఆర్’కి దాదాపు 400 కోట్ల బడ్జెట్ పెట్టారు. టికెట్ రేట్స్ తగ్గిస్తే ఈ రేంజ్ లో కలెక్షన్స్ కష్టమే.

Bigg Boss 5 : హౌస్ నుంచి జెస్సి అవుట్.. ఈ సారి కన్ఫర్మ్..

అయితే సినిమా టికెట్ ధరలపై ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర యూనిట్ కోర్టును ఆశ్రయించబోతున్నారు అనే వార్తలు వచ్చాయి. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర నిర్మాత దానయ్య ఈ వార్తలపై స్పందించారు. ఈ వివాదంపై దానయ్య మాట్లాడుతూ.. సినిమా టిక్కెట్ ధరలు తగ్గించడం మా సినిమాపై మాత్రమే కాదు అన్ని సినిమాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సంబంధించి మాకు కోర్టుకు వెళ్లే ఉద్దేశం లేదు, ఏపీ ముఖ్యమంత్రిని సంప్రదించి మా పరిస్థితిని వివరించేందుకు ప్రయత్నిస్తాం అని అన్నారు. సినిమా టికెట్ ధరల సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటాం అని తెలిపారు.

Bigg Boss 5 : మరోసారి సన్నీపై ఫైర్ అయిన నాగార్జున

మరి ఏపీ ప్రభుత్వం ఇందుకు ఒప్పుకుంటుందో లేదో చూడాలి. టికెట్ రేట్లను ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా తగ్గించడానికి ట్రై చేస్తుంది ఏపీ ప్రభుత్వం. ఒక పక్క వరుస స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కి ఉన్నాయి. మరి సినీ పరిశ్రమ నుంచి వచ్చే విన్నపాలని ఏపీ ప్రభుత్వం ఆలకిస్తుందా అనే ప్రశ్న తలెత్తుతుంది సినీ పరిశ్రమలో.