Bigg Boss 5 : మరోసారి సన్నీపై ఫైర్ అయిన నాగార్జున

ఇలా అందరు సన్నీ తప్పుని నాగార్జున దగ్గర ప్రూఫ్ లతో చూపించేసరికి సన్నీ మీద నాగ్ ఫైర్ అయ్యారు. ఇప్పటికే సన్నీపై రెండు సార్లు నాగ్ ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా సన్నీ మారతాడా లేదా

Bigg Boss 5 : మరోసారి సన్నీపై ఫైర్ అయిన నాగార్జున

Nag

Bigg Boss 5 :  కొద్దీ రోజులు ప్రశాంతంగా సాగిన బిగ్ బాస్ లో మళ్ళీ గొడవలు మొదలయ్యాయి. మొన్న కెప్టెన్సీ టాస్క్ కోసం హౌస్ లో కొట్టుకునే దాకా వెళ్లారు. ఆలోచించకుండా ఆవేశపడి గొడవలకు వెళ్లే సన్నీ ఈ సారి కూడా గొడవకు దిగాడు. గేమ్ మధ్యలో సిరి సన్నీకి గొడవ మొదలైంది. సిరిని ఇష్టమొచ్చిన మాటలు అన్నాడు. దీంతో సిరికి సపోర్ట్ గా షన్ను రావడంతో సన్నీ ఇంకా సీరియస్ అయి కొట్టే దాకా వచ్చాడు. గతంలో ఇలా చేసినందుకు సన్నీ మీద నాగార్జున ఫైర్ అయ్యాడు. హౌస్ లో జైలుకి కూడా పంపించారు. అయినా సన్నీ మారలేదు. నిన్నటి ఎపిసోడ్ లో మరోసారి నాగార్జున సన్నీ మీద ఫైర్ అయ్యారు.

Vijay Devarakonda : అమెరికాలో రాత్రిపూట.. పూరితో రౌడీ రచ్చ

నాగార్జున ఇంటిస‌భ్యుల‌తో ఎఫ్ఐఆర్ గేమ్ ఆడించారు. నచ్చని సభ్యుల మీద కంటెస్టెంట్స్ ఎఫ్ఐఆర్ రాయాలని చెప్పాడు. ఒకవేళ మెజారిటీ కంటెస్టెంట్స్ ఒప్పుకోకపోతే ఆ ఎఫ్ఐఆర్ నిలబడదు అని తెలిపాడు.

మొద‌ట‌గా యానీ మాస్టర్ గేమ్ లో గొడవ గుర్తుపెట్టుకొని కాజ‌ల్‌పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది.
త‌ర్వాత ర‌వి.. వెరీ బ్యాడ్ బిహేవియ‌ర్‌, లూజ్ టంగ్ అంటూ స‌న్నీపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశాడు. తంతా, అప్ప‌డం చేసి అమ్మేస్తా లాంటి మాటలు అన్నాడని ర‌వి చెప్ప‌డంతో తాను అన‌లేద‌ని అబద్దం చెప్పాడు స‌న్నీ. దీంతో నాగ్ వీడియో ప్లే చేశాడు. అందులో తంతా అని అన్నాడు. ఎవరిని అన‌డంతో గేమ్ లో టవర్ ను తంతాన‌ని క‌వ‌ర్ చేశాడ‌ని నాగ్ చెప్పడంతో సన్నీ పరువు పోయింది.
మరోసారి స‌న్నీ మాత్రం తాను బ్రిక్స్‌నే తంతాన‌న్నాన‌ని గట్టిగా చెప్పాడు. అమ్ముతాన‌ని సిరిని అన్నావంటూ మ‌రో వీడియో చూపించాడు నాగ్‌. స‌న్నీ త‌ర‌పున కాజ‌ల్ సపోర్ట్ వచ్చి అత‌డు సిరిని అమ్ముతాన‌ని అన‌లేద‌ని చెప్పింది.
త‌ర్వాత‌ స‌న్నీ.. సిరిని బోనులో నిల‌బెట్టి ఎఫైఆర్ ఫైల్ చేశాడు. కానీ మాన‌స్‌, కాజ‌ల్ త‌ప్ప‌ అంద‌రూ సిరిని నిర్దోషి అని అన్నారు.
మాన‌స్‌.. యానీ మాస్ట‌ర్‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసినా ఎవరూ సపోర్ట్ చేయలేదు.
శ్రీరామ‌చంద్ర‌.. ప్రియాంక‌ను బోనులో పెట్టాడు.
మాన‌స్ గ‌ట్టిగా అర‌వ‌డం న‌చ్చ‌లేద‌ని అత‌డిని ప్రియాంక బోనులో పెట్టింది. అయితే కంటెస్టెంట్స్ మాన‌స్‌ను నిర్దోషిగా చెప్పారు.
త‌ర్వాత కాజ‌ల్‌.. యానీ త‌న‌ను వెక్కిరిస్తుందంటూ బోనులో నిల‌బెట్టింది.
త‌ర్వాత ష‌ణ్ను.. నేను ఆడ‌వాళ్ల‌ను అడ్డం పెట్టుకుని ఆడ‌తాన‌న‌డం, న‌న్ను యూట్యూబ్ వ‌ర‌కే అని చెప్ప‌డం న‌చ్చ‌లేదంటూ స‌న్నీని బోనులో నిల‌బెట్టాడు. దీనికి సంబంధించిన‌ వీడియో కూడా నాగార్జున ప్లే చేసి చూపించ‌గా ర‌వి, శ్రీరామ్‌, సిరి, యానీ.. అత‌డు ష‌ణ్నును యూట్యూబ్ వ‌ర‌కే అన్నాడ‌ని చెప్ప‌గా మిగిలిన ముగ్గురు ష‌ణ్నును అన‌లేద‌ని, కామెంట్లు యూట్యూబ్ వ‌ర‌కే అని చెప్పాడ‌ని సన్నీని కవర్ చేయడానికి ట్రై చేశారు.

Pushpaka Vimanam : రౌడీ తమ్ముడికి షాక్.. పెట్టిన బడ్జెట్ కూడా వచ్చేలా లేదు

ఇలా అందరు సన్నీ తప్పుని నాగార్జున దగ్గర ప్రూఫ్ లతో చూపించేసరికి సన్నీ మీద నాగ్ ఫైర్ అయ్యారు. ఇప్పటికే సన్నీపై రెండు సార్లు నాగ్ ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా సన్నీ మారతాడా లేదా ఇలాగే ఉండి కంటెస్టెంట్స్, ప్రేక్షకుల నుంచి వ్యతిరేకతని తెచ్చుకుంటాడో చూడాలి.