Pushpaka Vimanam : రౌడీ తమ్ముడికి షాక్.. పెట్టిన బడ్జెట్ కూడా వచ్చేలా లేదు

పుష్పక విమానం సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ దేవరకొండ హీరోలకి షాక్ ఇచ్చాయి. ఈ సినిమాని తక్కువ బడ్జెట్ తో నిర్మించారు. దాదాపు 2 కోట్ల లోపు బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. సినిమాని

Pushpaka Vimanam : రౌడీ తమ్ముడికి షాక్.. పెట్టిన బడ్జెట్ కూడా వచ్చేలా లేదు

Pushpaka Vimanam (1)

Pushpaka Vimanam :  విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన సినిమా ‘పుష్పక విమానం’. గతంలో రెండు సినిమాలతో పర్వాలేదనిపించాడు ఆనంద్. తన తమ్ముడిని హీరోగా నిలబెట్టడానికి విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాడు. తన సొంత నిర్మాణ సంస్థలో ఈ సినిమాని నిర్మించాడు విజయ్. విజయ్ ప్రొడ్యూసర్ అవ్వడంతో ‘పుష్పక విమానం’ సినిమా ప్రమోషన్స్ ని హైరేంజ్ లో చేశారు. టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలంతా ఈ ప్రమోషన్స్ లో భాగమయ్యారు.

Vishwa : వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే మళ్ళీ బిగ్ బాస్ లోకి వెళ్తా

ఈ సినిమా టీజర్, ట్రైలర్, విజయ్ చేసిన ప్రమోషన్స్ చూసి మంచి కామెడీ సినిమాగా హిట్ కొడుతుంది అనుకున్నారు అంతా. ఇక ఇదే రోజు పెద్ద సినిమాలు కూడా రిలీజ్ కి లేకపోవడంతో కలెక్షన్స్ కూడా బాగానే వస్తాయి అనుకున్నారు. నవంబర్ 12న విడుదలైన ఈ సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది. పుష్పక విమానం సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ దేవరకొండ హీరోలకి షాక్ ఇచ్చాయి. ఈ సినిమాని తక్కువ బడ్జెట్ తో నిర్మించారు. దాదాపు 2 కోట్ల లోపు బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. సినిమాని గట్టిగా ప్రమోషన్ చేసి కలెక్షన్స్ కూడా భారీగా ఆశించారు. కానీ సినిమా రిలీజ్ అయి రెండు రోజులు అవుతున్నా పెట్టిన బడ్జెట్ లో సగం కూడా రాలేదు.

Rakul Preeth Sing : కండోమ్ టెస్టర్ గా రకుల్.. షాక్ లో ఫ్యాన్స్

మొదటి రోజు ఏపీ,తెలంగాణలో మొత్తం 0.36 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి 0.09 కోట్లు వచ్చాయి. మొత్తంగా వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్ కేవలం 0.45 కోట్లు వచ్చాయి. పుష్పక విమానం సినిమాను 2.2 కోట్లకు అమ్మారు. తొలిరోజు కేవలం 45 లక్షలు షేర్ వచ్చింది. మరి ఈ వీకెండ్ లో కలెక్షన్స్ వస్తాయేమో చూడాలి. అయినా సినిమా డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ఇంకా అమ్మలేదు కాబట్టి అక్కడ సేఫ్ అవ్వొచ్చు అని అనుకుంటున్నారు చిత్ర బృందం. మొత్తానికి అనుకున్న రేంజ్ లో ‘పుష్పక విమానం’ లేదని, రౌడీ హీరోలకి గట్టిగానే దెబ్బ కొట్టిందని సినీ వర్గాల సమాచారం.