Vishwa : వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే మళ్ళీ బిగ్ బాస్ లోకి వెళ్తా

హౌస్‌ నుండి బయటకు రావడం నాకు ఇంకా షాకింగ్‌గానే ఉంది. కానీ ప్రేక్షకుల ఓటింగ్‌ను నేను స్వాగతిస్తున్నాను. వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ద్వారా మళ్లీ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లే అవకాశం వస్తే

Vishwa : వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే మళ్ళీ బిగ్ బాస్ లోకి వెళ్తా

Vishwa

Vishwa :  బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్న విశ్వ గత వారం ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ కంటే ముందు సీరియల్స్ తో, సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ తో ప్రేక్షకులకి చేరువయ్యాడు. బిగ్ బాస్ తో మరింత గుర్తింపు వచ్చింది విశ్వకి. తాజాగా ఈ షోలో తన అనుభవం గురించి మీడియాతో మాట్లాడారు.

Rakul Preeth Sing : కండోమ్ టెస్టర్ గా రకుల్.. షాక్ లో ఫ్యాన్స్

విశ్వ మాట్లాడుతూ.. తెలుగు చిత్రసీమలో నా ప్రయాణం 2002లో మొదలైంది. 19 ఏళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసాను. చాలా సీరియల్స్ లో నటించాను. ‘పెళ్లికోసం’, ‘విద్యార్థి’తో పాటు పలు సినిమాలు కూడా చేశాను. ప్రస్తుతం నేను నటించబోయే ఓ సినిమా ప్రీ ప్రొడక్షన్‌లో ఉండగా బిగ్‌బాస్‌ హౌస్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ షోతో ప్రతి కుటుంబానికి నేను చేరువయ్యాను. బిగ్‌బాస్‌ స్క్రిప్టెడ్‌ కార్యక్రమం కాదు. అందులో జరిగేవన్నీ వాస్తవాలే అని అన్నారు విశ్వ.

Karthikeya : సినిమాపై బాధపెట్టేలా విమర్శలు చేయకండి : కార్తికేయ

ఇక కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుతూ.. బిగ్ బాస్ లో లోబో నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌గా మారిపోయాడు. బిగ్‌బాస్‌ ఇచ్చిన బెస్ట్‌ గిఫ్ట్‌ అదే. హౌస్‌ నుండి బయటకు రావడం నాకు ఇంకా షాకింగ్‌గానే ఉంది. కానీ ప్రేక్షకుల ఓటింగ్‌ను నేను స్వాగతిస్తున్నాను. వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ద్వారా మళ్లీ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లే అవకాశం వస్తే కచ్చితంగా వెళ్తాను అని అన్నాడు. శ్రీరామ్‌ ఈ షో విన్నర్‌ అవుతాడని నేను నమ్ముతున్నాను. నన్ను నేను మోసం చేసుకోవద్దని షోలో ఎప్పుడూ యాక్టింగ్‌ చేయలేదు. ఎవరికి నచ్చకపోయినా ఫర్వాలేదనే ఆలోచనతో ఎలాంటి ప్లాన్స్‌ లేకుండానే బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టి ఆడాను అని తెలిపాడు విశ్వ.