Karthikeya : సినిమాపై బాధపెట్టేలా విమర్శలు చేయకండి : కార్తికేయ

ఈ ప్రెస్ మీట్ లో కార్తికేయ మాట్లాడుతూ.. 'ఆర్‌ఎక్స్‌ 100’ తర్వాత నా కెరీర్‌లో ఎక్కువ పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చిన సినిమా ఇదే. ప్రతి సినిమాకి విమర్శలు రావడం సహజం. ‘బాహుబలి’ లాంటి

Karthikeya : సినిమాపై బాధపెట్టేలా విమర్శలు చేయకండి : కార్తికేయ

Karthhikeya

Karthikeya :  ‘ఆర్‌ఎక్స్‌ 100’ హీరో కార్తికేయ నుంచి ఆ సినిమా తర్వాత వచ్చిన సినిమాలేవీ ఆశించినంత ఫలితం దక్కలేదు. ఎప్పటికప్పుడు హిట్ కొట్టడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. అందుకోసం కొత్త కొత్త కథలని కూడా ట్రై చేస్తున్నాడు. తాజాగా ‘రాజా విక్రమార్క’ అంటూ కామెడీ యాక్షన్ సినిమాతో వచ్చాడు. రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. అయితే కొంతమంది మాత్రం బాగోలేదు అంటూ నెగిటివ్ టాక్ చెప్పారు. ఈ సినిమా టీం నిన్న సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించి సినిమాకి వచ్చే రెస్పాన్స్ గురించి మాట్లాడారు.

Hero : రిపబ్లిక్ డేకి మహేష్ ఫ్యామిలీ నుంచి ‘హీరో’

ఈ ప్రెస్ మీట్ లో కార్తికేయ మాట్లాడుతూ.. ‘ఆర్‌ఎక్స్‌ 100’ తర్వాత నా కెరీర్‌లో ఎక్కువ పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చిన సినిమా ఇదే. ప్రతి సినిమాకి విమర్శలు రావడం సహజం. ‘బాహుబలి’ లాంటి గొప్ప సినిమాపై కూడా విమర్శలొచ్చాయి. ఈ సినిమాలో మేము చేసిన తప్పుల్ని కొన్ని సమీక్షల్లో రాశారు. భవిష్యత్తులో అవి పునరావృతం కాకుండా జాగ్రత్తపడతాం. అయితే విమర్శలెప్పుడూ ఇతరుల్ని బాధపెట్టేలా ఉండకూడదు అని రివ్యూలు రాసిన వారిని ఉద్దేశించి అన్నారు. అలాగే స్మోకింగ్‌ సీన్స్‌ కూడా లేకుండా చక్కటి క్లీన్‌ ఎంటర్‌టైనర్‌గా సినిమా చేశామని ప్రేక్షకులందరూ అభినందిస్తున్నారు అని అన్నారు.

Shannu – Deppthi : బిగ్ బాస్ లో సన్నీ- షణ్ను గొడవ… సన్నీని ఏకిపారేసిన షణ్ను గర్ల్ ఫ్రెండ్

ఇలా చాలా సినిమాలపై కొంతమంది నెగిటివ్ టాక్స్ రాస్తున్నారు. థియేటర్ కి ప్రేక్షకులు వచ్చి సినిమా చూడకముందే ఇలాంటి రివ్యూలు రాసి సినిమాకి నష్టం వాటిల్లేలా చేస్తున్నారు. ఇలాంటి సమీక్షలపై ఇప్పటికే చాలా మంది సినీ పరిశ్రమ నుంచి మాట్లాడారు. హీరో కార్తికేయ తన సినిమాపైన వచ్చే విమర్శలకి బాధపెట్టేలా ఉండకూడదు అనడంతో ఈ వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారి తీశాయి.