Hero : రిపబ్లిక్ డేకి మహేష్ ఫ్యామిలీ నుంచి ‘హీరో’

 సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు జిల్లా ఏంపీ గల్లా జయదేవ్‌ తనయుడు అశోక్‌ గల్లా హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని శ్రీరామ్‌ ఆదిత్య

Hero : రిపబ్లిక్ డేకి మహేష్ ఫ్యామిలీ నుంచి ‘హీరో’

Hero

Hero :  సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు జిల్లా ఏంపీ గల్లా జయదేవ్‌ తనయుడు అశోక్‌ గల్లా హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ ‘హీరో’ అని పెట్టారు. ఇటీవల ఈ సినిమా నుంచి టీజర్ కూడా రిలీజ్ అయింది. మహేష్ బాబు సోదరి పద్మావతి గల్లా ఈ సినిమాని అమర రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌‌మెంట్స్ బ్యానర్ పై నిర్మించడం విశేషం. ‘ఇస్మార్ట్ బ్యూటీ’ నిధి అగర్వాల్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.

Shannu – Deppthi : బిగ్ బాస్ లో సన్నీ- షణ్ను గొడవ… సన్నీని ఏకిపారేసిన షణ్ను గర్ల్ ఫ్రెండ్

ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్టు సమాచారం. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ‘హీరో’ సినిమాని జనవరి 26న రిపబ్లిక్ డే కానుకగా థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి. ఇవన్నీ రిలీజ్ అయిన తర్వాత రిపబ్లిక్ డేకి ఇంకా ఎవరు సినిమాని అనౌన్స్ చేయకపోవడంతో ఆ డేట్ ని అశోక్ గల్లా ఆక్రమించాడు. కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తుండటంతో అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి అశోక్ సూపర్ స్టార్ అభిమానులని ఎంతగా మెప్పిస్తాడో చూడాలి.