Shannu – Deppthi : బిగ్ బాస్ లో సన్నీ- షణ్ను గొడవ… సన్నీని ఏకిపారేసిన షణ్ను గర్ల్ ఫ్రెండ్

సన్నీ ఎక్కువగా షణ్నుతోనే గొడవలు పెట్టుకున్నాడు. తాజాగా మరోసారి వీళ్లిద్దరు గొడవ పడ్డారు. ఈ గొడవపై తాజాగా షణ్ను గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునైనా ఇంస్టాగ్రామ్ లో సన్నీని ఏకిపారేసింది.

Shannu – Deppthi : బిగ్ బాస్ లో సన్నీ- షణ్ను గొడవ… సన్నీని ఏకిపారేసిన షణ్ను గర్ల్ ఫ్రెండ్

Shannu Sunny

Shannu – Deppthi :  గత సీజన్ల కంటే ఈ సీజన్ బిగ్ బాస్ లో ఎక్కువగా గొడవలే ఉన్నాయని చూస్తున్న ఎవరికైనా తెలుస్తుంది. ఇక సన్నీ గురించి చెప్పక్కర్లేదు. అవసరం ఉన్నా లేకపోయినా గొడవలకు దిగుతాడు, ఆవేశపడతాడు, అరుస్తాడు. ఈ విషయంలో నాగార్జున వార్నింగ్ ఇచ్చినా కొన్ని రోజులు సైలెంట్ గా ఉండి మళ్ళీ అదే పంథాలోకి వచ్చాడు. తాను మారకుండా వేరే వాళ్ళతో గొడవలు పడుతూ వేరే వాళ్ళని బ్యాడ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాడు మొదటి నుంచి.

Radheshyam : ఈ రాతలే… రాధేశ్యామ్ నుంచి ఫస్ట్ సాంగ్ రెడీ

ఇక హౌస్ లో ఎక్కువగా షణ్నుతోనే గొడవలు పెట్టుకున్నాడు. తాజాగా మరోసారి వీళ్లిద్దరు గొడవ పడ్డారు. నిన్న బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్‌లో సన్నీ సిరిని ఇష్టమొచ్చిన మాటలు అన్నాడు. దీంతో సిరి ఫ్రెండ్ అయిన షణ్ను మధ్యలో రావడంతో వీళ్ళ ఇద్దరి మధ్య గొడవ ఇంకా ఎక్కువ అయింది. సన్నీ షణ్నుని కూడా అనరాని మాటలు అన్నాడు. కొడతాను, తంతాను, అప్పడం చేస్తాను, ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని ఆడతావు.. ఇలా చాలా మాటలు అన్నాడు. మొదట్లో షణ్ను మాములుగా తీసుకున్నా సన్నీ రెచ్చిపోవడంతో షణ్ను కూడా తన కోపం చూపించాడు. అయితే ఈ గొడవపై తాజాగా షణ్ను గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునైనా ఇంస్టాగ్రామ్ లో సన్నీని ఏకిపారేసింది. సన్నీని ఉద్దేశించి పెద్ద పోస్ట్ పెట్టింది.

NBK 107 : బాలయ్య యాక్షన్ మొదలైంది

సన్నీకి దీప్తి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాసుకొచ్చింది… అప్పడం అయిపోతావ్‌ అనవసరంగానా? చేతగాని ఆటలు ఆడుతున్నాడు ఏంటి? ఫిజికల్‌ అయ్యి గట్టి గట్టిగా అరిస్తే గేమ్ ఆడినట్లా? ఫిజికల్‌ అవ్వడం కన్నా కష్టం అయిన టాస్క్‌ మైండ్‌తో ఆడటం. అది షణ్ను వంద శాతం ఆడుతున్నాడు. బిగ్‌బాస్‌ చూశాక తన మీద ప్రేమ మరింత పెరిగింది. చాలా మెచ్యూర్‌గా బిహేవ్‌ చేస్తున్నాడు. సపోర్ట్‌గా నిల్చుంటే ఆడవాళ్లని అడ్డుపెట్టుకొని గేమ్‌ ఆడినట్లా? మరి నీకు కాజల్‌, మానస్‌ సపోర్ట్‌ చేసినప్పుడు ఏమైంది? నువ్వు ఎలా ఉండాలో మిగతా వాళ్లుకూడా అలానే ఉండాలా ఏంది? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Samantha : సమంతది నిజమైన ప్రేమ.. ఆమె వల్లే నేను మారాను

అంతేకాక.. నువ్వు బెస్ట్‌ అనుకో తప్పులేదు. కానీ మిగతా అందరిని చిన్న చూపు చూడకు. నీలా ఇంకొకరు ఉండలేరు, ఇంకొకరిలా నువ్వు కూడా ఉండలేవు. యూట్యూబ్‌ వరకే అని మాట్లాడారు. ఈ స్టేజ్‌ వరకు వచ్చాడు అంటే ఎంత కష్టపడి వచ్చాడు అని హ్యాపీగా ఫీల్‌ అవ్వకుండా ఇలాంటి మాటలు అనడం తప్పు సన్నీగారు. మీకు రా అంటేనే పడలేకపోయారు. మరి మీరు అన్ని మాటలు అంటే ఎలా? అంటూ సన్నీని ఏకిపారేసింది.

Chef Mantra : సెలబ్రిటీలతో ‘చెఫ్ మంత్ర’.. ఆహాలో మరో కొత్త ప్రోగ్రాం

దీంతో దీప్తి పెట్టిన ఈ పోస్ట్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు షణ్ను ఆటను పొగిడింది. తప్పు అయితే నేర్చుకుంటాం రా బై అని ఎంత బాగా చెప్పావ్‌ షణ్నూ..నిన్ను హగ్‌ చేసుకోవాలనుంది అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్ చేసింది దీప్తి సునైనా.