Radheshyam : ఈ రాతలే… రాధేశ్యామ్ నుంచి ఫస్ట్ సాంగ్ రెడీ

తాజాగా 'రాధేశ్యామ్' సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రానుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ రాతలే... అంటూ ఈ సాంగ్ సాగనుంది. నవంబర్ 15న సాయంత్రం 5 గంటలకు ఈ సాంగ్

Radheshyam : ఈ రాతలే… రాధేశ్యామ్ నుంచి ఫస్ట్ సాంగ్ రెడీ

Radheshyam Song

Radheshyam :  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ రాబోతున్న సినిమా ‘రాధే శ్యామ్’. కరోనా వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి అప్ డేట్స్ లేవని ఫాన్స్ చాలా అసహనంగా ఫీల్ అవుతున్నారు. చిత్ర యూనిట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఇటీవలే ‘రాధేశ్యామ్’ టీజర్ రిలీజ్ చేశారు. జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. గత వారం రోజులుగా తెలుగు హీరోల సినిమాల నుంచి వరుసగా సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి. కానీ ‘రాధేశ్యామ్’ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక్క సాంగ్ గురించి కూడా ఎలాంటి అప్ డేట్ లేదు అని అభిమానులు బాధపడుతుండగా చిత్ర యూనిట్ అభిమానులకు తీపి కబురు అందించింది.

Chef Mantra : సెలబ్రిటీలతో ‘చెఫ్ మంత్ర’.. ఆహాలో మరో కొత్త ప్రోగ్రాం

గత రెండు రోజుల నుంచి ‘రాధేశ్యామ్’ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రాబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ సినిమా టీం నుంచి ఎలాంటి ప్రకటన లేదు. తాజాగా ‘రాధేశ్యామ్’ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రానుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ రాతలే… అంటూ ఈ సాంగ్ సాగనుంది. నవంబర్ 15న సాయంత్రం 5 గంటలకు ఈ సాంగ్ రిలీజ్ అవ్వనున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు.

Samantha : సమంతది నిజమైన ప్రేమ.. ఆమె వల్లే నేను మారాను

ఈ అనౌన్స్మెంట్ తో పాటు ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో నీళ్ళల్లో ఒక కార్ మునిగిపోతున్నట్టు, అందులో ఒక ప్రేమ జంట ఉన్నట్టు చూపించారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ చూసి ఈ సినిమా చాలా కొత్తగా ఉండబోతుందని అనుకుంటున్నారు. అభిమానులు ఈ పాట కోసం, సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Radheshyam : పూర్తయిన ‘రాధేశ్యామ్’ మ్యూజిక్..ఫస్ట్ సాంగ్ ఎప్పుడు??

‘రాధేశ్యామ్’ సినిమాకి హిందీ వర్షన్ లో మిథూన్, మనన్ భరద్వాజ్ లు కలిసి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక సౌత్ లాంగ్వేజెస్ లో జస్టిన్ ప్రభాకర్ మ్యూజిక్ అందిస్తున్నారు. నిన్నే మనన్ భరద్వాజ్ తన ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశారు. ఎన్నో నిద్ర లేని రాత్రులు, ఎడిటింగ్స్, రికార్డింగ్స్, సంవత్సరాలుగా సహనం.. ఫైనల్ గా తమ హానెస్ట్ అటెంప్ట్ ‘రాధేశ్యామ్’ మ్యూజిక్ ని ప్రెజెంట్ చేసే సమయం వచ్చింది అని పోస్ట్ చేశాడు. అంతే కాక మీరందరు ఇది తొందరగా వినాలి అని పోస్ట్ చేశాడు. దీంతో రాధేశ్యామ్ మ్యూజిక్ వర్క్ కంప్లీట్ అయిపోయిందని తెలుస్తుంది.