Samantha : సమంతది నిజమైన ప్రేమ.. ఆమె వల్లే నేను మారాను

సమంత, ఉపాసన మంచి ఫ్రెండ్స్. ఇటీవల ఉపాసన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంత గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది.

Samantha : సమంతది నిజమైన ప్రేమ.. ఆమె వల్లే నేను మారాను

Samantha

Samantha :  చై సామ్ విడాకుల అనంతరం సమంత ఒక పక్క సినిమాలు చేస్తూ మరో పక్క ఫ్రెండ్స్ తో సరదాగా గడుపుతూ లైఫ్ లో బిజీగా ఉండటానికి ట్రై చేస్తుంది. ఇటీవలే తన ఫ్రెండ్స్ తో కలిసి ఛార్ ధామ్ యాత్రకి వెళ్లి వచ్చింది. ఆ తర్వాత ఫ్రెండ్స్ బర్త్ డే పార్టీలకు వెళ్ళింది. సమంతకి రామ్ చరణ్ వైఫ్ ఉపాసన, స్టైలిస్ట్ శిల్పారెడ్డి, డైరెక్టర్ నందిని రెడ్డి, స్టైలిస్ట్ నీరజ కోన, డాక్టర్ మంజుల ఇలా ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. విడాకుల తర్వాత నుంచి వీళ్ళతో సమంత ఎక్కువ సమయం గడుపుతుంది. ఇటీవల దీపావళి ఉపాసనతో కలిసి సెలెబ్రేట్ చేసుకుంది.

Liger Movie : లైగర్ కోసం వెయిట్ చేస్తున్నాను.. ట్విట్టర్ లో విజయ్, దుల్కర్ ఇంట్రెస్టింగ్ చాట్

ఉపాసన ఒకపక్క రామ్ చరణ్ వైఫ్, మెగా కోడలిగానే కాక తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంది. అపోలో హాస్పిటల్స్ ని నిర్వహిస్తూ, హెల్త్ కోసం ఓ యూట్యూబ్ ఛానెల్, ఓ వెబ్ సైట్ నడిపిస్తుంది. సమంత ఈ ఛానెల్ లో ఎన్నో హెల్త్ స్పెషల్ డిష్ లు చేసింది, వెబ్ సైట్ కోసం ఎన్నో ఆర్టికల్స్ కూడా రాసింది. సమంత, ఉపాసన మంచి ఫ్రెండ్స్. ఇటీవల ఉపాసన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంత గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది.

Radheshyam : పూర్తయిన ‘రాధేశ్యామ్’ మ్యూజిక్..ఫస్ట్ సాంగ్ ఎప్పుడు??

సమంతలో సాయం చేసే గుణం ఉందని, సమంత ఎన్నో విషయాల్లో తనకి సహాయం అందించారని చెప్పింది. సమంతది నిజమైన ప్రేమ, తన మంచితనంతో మా మీద ప్రేమను కురిపిస్తుంది. సమంత లాంటి ఫ్రెండ్ ఉండటం చాలా అదృష్టం అని తెలిపింది. సమంత మా వెబ్ సైట్ కోసం కొన్ని ఆర్టికల్స్ రాసింది. సమంత రాసిన ఆర్టికల్స్‌ ఎడిట్‌ చేసేంత వరకు నేను మాసం బాగా తినేదాన్ని, నేను తెలంగాణ బిడ్డను కాబట్టి పండుగల సమయంలో కూడా మాంసం తినేదానిని కానీ సమంత ఆర్టికల్స్‌ చూసిన తర్వాత మాంసం తినడం చాలా వరకు తగ్గించానని తెలిపింది. త్వరలో వెజిటేరియన్ గా కూడా మారిపోవచ్చు అని తెలిపింది. సమంత వల్లే నేను మారాను అని ఉపాసన ఇంటర్వ్యూలో చెప్పింది.