Radheshyam : పూర్తయిన ‘రాధేశ్యామ్’ మ్యూజిక్..ఫస్ట్ సాంగ్ ఎప్పుడు??

తాజాగా గత రెండు రోజుల నుంచి రాధేశ్యామ్ ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేస్తారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. కానీ మూవీ టీం నుంచి ఎలాంటి ప్రకటన లేదు. ఇలాంటి సమయంలో రాధేశ్యామ్ హిందీ

Radheshyam : పూర్తయిన ‘రాధేశ్యామ్’ మ్యూజిక్..ఫస్ట్ సాంగ్ ఎప్పుడు??

Radheshyam

Radheshyam :  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ రాబోతున్న సినిమా ‘రాధే శ్యామ్’. కరోనా వల్ల ఈ సినిమా చాలా ఆలస్యంగా వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి అప్ డేట్స్ లేవని ఫాన్స్ చాలా అసహనంగా ఉన్నారు. ఇటీవలే ‘రాధేశ్యామ్’ టీజర్ రిలీజ్ చేశారు. జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. గత వారం రోజులుగా తెలుగు హీరోల సినిమాల నుంచి వరుసగా సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి. కానీ ‘రాధేశ్యామ్’ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక్క సాంగ్ గురించి కూడా ఎలాంటి అప్ డేట్ లేదు.

Bigg Boss 5 : కంటెస్టెంట్స్ మధ్య గొడవలు కలిసొచ్చి బిగ్ బాస్ కొత్త కెప్టెన్ గా రవి

తాజాగా గత రెండు రోజుల నుంచి రాధేశ్యామ్ ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేస్తారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. కానీ మూవీ టీం నుంచి ఎలాంటి ప్రకటన లేదు. ఇలాంటి సమయంలో రాధేశ్యామ్ హిందీ వర్షన్ మ్యూజిక్ డైరెక్టర్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ ఈ పోస్ట్ చూసి కచ్చితంగా త్వరలో సాంగ్ రిలీజ్ చేస్తారు అని ఆశిస్తున్నారు.

Anchor Suma : కొత్తగా జిమ్ లో కష్టపడుతున్న సుమ.. వీడియో వైరల్

‘రాధేశ్యామ్’ సినిమాకి హిందీ వర్షన్ లో మిథూన్, మనన్ భరద్వాజ్ లు కలిసి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక సౌత్ లాంగ్వేజెస్ లో జస్టిన్ ప్రభాకర్ మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా మనన్ భరద్వాజ్ తన ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశారు. ఎన్నో నిద్ర లేని రాత్రులు, ఎడిటింగ్స్, రికార్డింగ్స్, సంవత్సరాలుగా సహనం.. ఫైనల్ గా తమ హానెస్ట్ అటెంప్ట్ ‘రాధేశ్యామ్’ మ్యూజిక్ ని ప్రెజెంట్ చేసే సమయం వచ్చింది అని పోస్ట్ చేశాడు. అంతే కాక మీరందరు ఇది తొందరగా వినాలి అని పోస్ట్ చేశాడు.

Malavika Sundar : తన కంటే చిన్నవాడిని పెళ్లి చేసుకున్న ప్రముఖ గాయని

ఈ రేంజ్ లో మ్యూజిక్ డైరెక్టర్ పోస్ట్ పెట్టడంతో ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. కచ్చితంగా ఈ నెలలోనే రాధేశ్యామ్ నుంచి ఫస్ట్ సింగిల్ ఉండబోతుంది అని ఆశిస్తున్నారు. అయితే సౌత్ వర్షన్ లో మ్యూజిక్ ఇంకా కంప్లీట్ అయిందా లేదా తెలియాల్సి ఉంది.