Anchor Suma : కొత్తగా జిమ్ లో కష్టపడుతున్న సుమ.. వీడియో వైరల్

సహజంగానే సెలబ్రిటీలు తమ ఆరోగ్యం కోసం, ఫిట్నెస్ కోసం జిమ్ లో కష్టపడుతూ ఉంటారు. అయితే సుమ ఎప్పుడూ జిమ్ కి వెళ్ళలేదు. ఇంట్లోనే ఎక్సర్ సైజులు, యోగా లాంటివి చేస్తుంది. అప్పుడప్పుడు

Anchor Suma : కొత్తగా జిమ్ లో కష్టపడుతున్న సుమ.. వీడియో వైరల్

Suma

Updated On : November 13, 2021 / 8:01 AM IST

Anchor Suma :  తెలుగు రాష్ట్రాల్లో అందరి ఇళ్లల్లో బాగా వినపడే సెలబ్రిటీ పేరు సుమ. ఇక ఆడవాళ్లు సుమని, సుమ యాంకరింగ్ ని ఎంతగానో అభినందిస్తారు. తన యాంకరింగ్ తో ఎన్నో సంవత్సరాలుగా అలరిస్తుంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ సుమ అభిమానులే. ఇన్నాళ్లు బుల్లితెరపై యాంకర్‌గా రాణించి తాజాగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. సుమ ప్రధాన పాత్రలో ‘జయమ్మ పంచాయితీ’ అనే సినిమా తెరకెక్కుతోంది.

Malavika Sundar : తన కంటే చిన్నవాడిని పెళ్లి చేసుకున్న ప్రముఖ గాయని

సహజంగానే సెలబ్రిటీలు తమ ఆరోగ్యం కోసం, ఫిట్నెస్ కోసం జిమ్ లో కష్టపడుతూ ఉంటారు. అయితే సుమ ఎప్పుడూ జిమ్ కి వెళ్ళలేదు. ఇంట్లోనే ఎక్సర్ సైజులు, యోగా లాంటివి చేస్తుంది. అప్పుడప్పుడు వీటికి సంబంధించిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అయితే తాజాగా జిమ్ లో జాయిన్ అయి వర్కౌట్స్ చేస్తున్నట్టు వీడియో షేర్ చేసింది.

Saif Alikhan : ఇంట్లో ఉంటే పిల్లలు పుడతారని భయమేస్తుంది : సైఫ్ అలీఖాన్

ఈ సినిమా కోసం సుమ ఫిట్నెస్ పై మరింత దృష్టి పెట్టినందువల్లే జిమ్‌లో వర్కౌట్స్‌ చేస్తోంది అని సమాచారం. అంతేగాక ఇందుకోసం స్పెషల్ ట్రైనర్‌ని కూడా నియమించుకుంది. తాజాగా జిమ్‌లో డంబుల్స్ మోస్తూ కష్టపడుతున్న వీడియోను సుమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియోకి 2వ సెట్ డంబెల్స్ ఎత్తిన తర్వాత నా చేతులు ఎంత నొప్పిగా ఉన్నాయో వర్ణించలేను. ఆపమంటాడేమో అని నా ట్రైనర్ రాహుల్ వైపు చూస్తూ ఉంటాను, కానీ అతను మాత్రం ఆ మాట చెప్పడు అంటూ పోస్ట్ చేసింది సుమ.

Macharla Niyojakavargam : పవన్ కి పోటీగా నితిన్.. ‘మాచర్ల నియోజకవర్గం’

ఇక ఎప్పుడు లేనిది సుమ ఇలా జిమ్‌లో కష్టపడటంతో ఈ వీడియో వైరల్‌ అవుతోంది. సుమను ఇలా చూసి నెటిజన్లు, అభిమానులు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మరోసారి తన వర్క్ పట్ల ఎంత డేడికేట్ గా ఉంటుందో అర్థమయ్యేలా తెలిపింది సుమ.