Malavika Sundar : తన కంటే చిన్నవాడిని పెళ్లి చేసుకున్న ప్రముఖ గాయని

ప్రేమకి వయసుతో సంబంధం లేదు అనే మాటని మరోసారి రుజువు చేశారు. తమిళ్ సూపర్‌ సింగర్‌ ఫేమ్‌, తెలుగు, తమిళ్ సింగర్ మాళవిక సుందర్‌ తాజాగా వివాహం చేసుకుంది. తనకంటే వయసులో చిన్నవాడిని ప్రేమ

Malavika Sundar : తన కంటే చిన్నవాడిని పెళ్లి చేసుకున్న ప్రముఖ గాయని

Malavika

Updated On : November 13, 2021 / 7:42 AM IST

Malavika Sundar :  ప్రేమకి వయసుతో సంబంధం లేదు అనే మాటని మరోసారి రుజువు చేశారు. తమిళ్ సూపర్‌ సింగర్‌ ఫేమ్‌, తెలుగు, తమిళ్ సింగర్ మాళవిక సుందర్‌ తాజాగా వివాహం చేసుకుంది. తనకంటే వయసులో చిన్నవాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
Saif Alikhan : ఇంట్లో ఉంటే పిల్లలు పుడతారని భయమేస్తుంది : సైఫ్ అలీఖాన్

మాళవిక.. తమిళ సూపర్‌ సింగర్‌ షోలో ప్లే బ్యాక్‌ సింగర్‌గా అలరించింది. ఈ షోతో మాళవికు తమిళంతో పాటు తెలుగులోనూ అనేక అవకాశాలు వచ్చాయి. వచ్చిన అవకాశాన్ని మాళవిక కరెక్ట్ గా ఉపయోగించుకుంది. తమిళ్ తెలుగులో ఇప్పటికే చాలా సినిమాల్లో పాడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Rashmika : డేటింగ్ చేయడానికి వయసుతో సంబంధం లేదు : రష్మిక
కొద్ది రోజుల క్రితం తనకంటే వయసులో చిన్నవాడిని పెళ్లి చేసుకోబోతున్నానని తెలిపింది. పెళ్లికి వయసుతో పని లేదని, ఇద్దరం ఒకరినొకరిని అర్థం చేసుకుని, గౌరవించుకుంటే అంతే చాలని చెప్పింది. తాజాగా ఎంటర్‌ప్రెన్యూర్‌ అశ్విన్‌ కశ్యప్‌ రఘురామన్‌తో కలిసి వైవాహిక బంధంలో అడుగుపెట్టింది మాళవిక. ఇతడు వయసులో మాళవిక కంటే చిన్నవాడు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాళవికకు తెలుగు, తమిళ్ సింగర్స్ తో పాటు ప్రముఖ సినీ సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.