Macharla Niyojakavargam : పవన్ కి పోటీగా నితిన్.. ‘మాచర్ల నియోజకవర్గం’

నితిన్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అని అందరికి తెలుసు. మరి అలంటి నితిన్ పవన్ కి పోటీగా వెళ్లడమేంటి అని అందరూ అనుకుంటున్నారు. నితిన్ తెలిసి చేశాడా? తెలియక చేశాడా? అని అభిమానులు

Macharla Niyojakavargam : పవన్ కి పోటీగా నితిన్.. ‘మాచర్ల నియోజకవర్గం’

Macharla (1)

Macharla Niyojakavargam :  ఒకప్పుడు మాస్ సినిమాలు చేసి వరుస ప్లాప్స్ మూట కట్టుకున్నాడు నితిన్. ఆ తర్వాత కొత్త రకం ప్రేమ కథలు, కామెడీ ఉన్న కథలు చేస్తూ సేఫ్ జోన్ లో వెళ్తున్నాడు. ఇటీవలే నితిన్ ప్రయోగాత్మకంగా చేసిన ‘మాస్ట్రో’ సినిమా ఓటిటిలో రిలీజ్ అయి మెప్పించింది. మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత నితిన్ యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు. నితిన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ మాచర్ల నియోజకవర్గం’. ఇది నితిన్ సొంత బ్యానర్ లో నిర్మితమవుతుంది. ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి ఇందులో హీరోయిన్ గా చేస్తుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్ ని తాజాగా అనౌన్స్ చేసారు.

Chiranjeevi : కోటి ఋణం తీర్చుకోలేకపోయాను అనే బాధ ఉండేది: చిరంజీవి

‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 29న విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పటికే సమ్మర్ ని టార్గెట్ చేసుకొని పెద్ద పెద్ద సినిమాలు చాలా ఉన్నాయి. అందులో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ ఒకటి. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఒక వారం గ్యాప్ తో అటు ఇటుగా రిలీజ్ చేసిన పర్లేదు కానీ నితిన్ సినిమాని కూడా అదే రోజు రిలీజ్ కి అనౌన్స్ చేశారు. ‘హరిహర వీరమల్లు’ సినిమాని కూడా ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తామని ప్రకటించారు చిత్రబృందం. మరి అదే రోజు నితిన్ సినిమా కూడా రిలీజ్ చేయబోతున్నాడు.

Radheshyam : ‘రాధేశ్యామ్’ దర్శక నిర్మాతలకు ప్రభాస్ ఫ్యాన్ సూసైడ్ లేఖ.. నా చావుకి కారణం మీరే

అయితే నితిన్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అని అందరికి తెలుసు. మరి అలంటి నితిన్ పవన్ కి పోటీగా వెళ్లడమేంటి అని అందరూ అనుకుంటున్నారు. నితిన్ తెలిసి చేశాడా? తెలియక చేశాడా? అని అభిమానులు అనుకుంటున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీ టాక్ ప్రకారం ‘హరిహర వీరమల్లు’ ఇంకా సెకండ్ షెడ్యూల్ షూటింగ్లోనే ఉంది. ఇది భారీ సినిమా కాబట్టి షూటింగ్ కి కూడా ఎక్కువ టైం పడుతుంది. కచ్చితంగా పవన్ సినిమా వాయిదా పడుతుంది అనే ఉద్దేశంతోనే నితిన్ తన సినిమా డేట్ ని అనౌన్స్ చేసినట్టు తెలుస్తుంది.

Faria Abdullah : ‘ఢీ’ సీక్వెల్ లో చిట్టి

‘మాచర్ల నియోజకవర్గం’ రాజకీయాంశాలతో కూడిన యాక్షన్ సినిమా. నితిన్ మొదటిసారిగా పాలిటిక్స్ జోనర్ లో రాబోతున్నాడు. పొలిటికల్‌ బ్యాడ్‌డ్రాప్‌లో నడిచే ఈ సినిమాలో ప్రేమకథ కూడా ఉండబోతుంది. నితిన్ పొలిటికల్ గా మొదటి సారి చేస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. అంతే కాక పవన్ కి సపోర్ట్ గా ఈ సినిమాలో సీన్స్ ఏమన్నా ఉంటాయేమో అని అభిమానులు ఆశిస్తున్నారు.