Faria Abdullah : ‘ఢీ’ సీక్వెల్ లో చిట్టి

 ‘జాతిరత్నాలు’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది ఫరియా అబ్ధుల్లా. గతంలో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు చేసినా 'జాతిరత్నాలు' సినిమాలో హీరోయిన్ గా తన నవ్వుతో,

Faria Abdullah : ‘ఢీ’ సీక్వెల్ లో చిట్టి

Fariya

Faria Abdullah :  ‘జాతిరత్నాలు’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది ఫరియా అబ్ధుల్లా. గతంలో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు చేసినా ‘జాతిరత్నాలు’ సినిమాలో హీరోయిన్ గా తన నవ్వుతో, తన అల్లరితో, తన నటనతో తెలుగు రాష్ట్రాల్లో స్టార్ అయిపొయింది. చిట్టి చిట్టి పాటతో చాలా మంది అభిమానులని సంపాదించుకుంది. మొదటి సినిమా పెద్ద హిట్ అవ్వడంతో పాటు ఫరియా హైదరాబాదీ అమ్మాయి కావడంతో అవకాశాలు బాగానే వస్తాయి అనుకున్నారు. కానీ ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ అవకాశాలేవీ రాలేదు. ఇటీవల వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో ఒక క్యారెక్టర్ చేసింది. ఫరియా హీరోయిన్ గా కొనసాగాలంటే ఇంకో మంచి సినిమా పడాల్సిందే.

Surekha Vani : దుబాయ్ లో మందు బాటిల్ తో సురేఖ.. ఇంతకన్నా ఆనందం ఏముంది అంటూ పోస్ట్

ఈ సమయంలో ఫరియాకి మంచి ఛాన్స్ వచ్చిందని సమాచారం. మంచు విష్ణు, శ్రీనువైట్ల కాంబోలో వచ్చిన ‘ఢీ’ సినిమా అప్పట్లో భారీ విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘డిడి డబల్ డోస్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘ఢీ’ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాగా వచ్చింది. ఇప్పుడు ‘డిడి డబల్ డోస్’ సినిమా కూడా ఫుల్ కామెడీ తో ఉండబోతుందని సమాచారం.

Marakkar : సినిమా టీంపై స్టార్ హీరో ఫాన్స్ ఆగ్రహం.. శాంతపరిచిన మినిస్టర్

అందుకే ‘జాతిరత్నాలు’ సినిమాలో తన స్టైల్ లో కామెడీ పండించిన ఫరియాను ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. దీంతో మరోసారి ఫరియా పెద్ద ప్రాజెక్ట్ పట్టింది. ఈ సినిమాతో అయినా ఫరియాకి అవకాశాలు వరుసగా వస్తాయేమో చూడాలి.