Marakkar : సినిమా టీంపై స్టార్ హీరో ఫాన్స్ ఆగ్రహం.. శాంతపరిచిన మినిస్టర్

అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. ఇక ఈ ప్రకటన తర్వాత మోహన్ లాల్ అభిమానులు రోడ్ల మీదకు వచ్చి మరీ ఆందోళన చేస్తున్నారు

Marakkar : సినిమా టీంపై స్టార్ హీరో ఫాన్స్ ఆగ్రహం.. శాంతపరిచిన మినిస్టర్

Marakkar

Marakkar : మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘మరక్కార్ ది లయన్ ఆఫ్ అరేబియన్ సీ’ సినిమా భారీ అంచనాలతో నిర్మితమైంది. కానీ కరోనా కారణంగా, థియేటర్స్ సరిగ్గా లేకపోవడంతో ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమాను థియేటర్ల ద్వారానే భారీ ఎత్తున పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయాలని అనుకున్నారు కాని కరోనా వల్ల అది కుదరలేదు.

Bigg Boss 5 : జెస్సికి మళ్ళీ ఆరోగ్య సమస్యలు.. ఉంచుతారా? పంపిస్తారా?

దేశంలోని కొన్ని స్టేట్స్ లో థియేటర్స్ పై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో ‘మరక్కార్’ సినిమాను డైరెక్ట్ ఓటీటీకి రిలీజ్ చేయాలని భావించారు నిర్మాతలు. అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. ఇక ఈ ప్రకటన తర్వాత మోహన్ లాల్ అభిమానులు రోడ్ల మీదకు వచ్చి మరీ ఆందోళన చేస్తున్నారు. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతుంది. ఈ సినిమాని థియేటర్లలోనే రిలీజ్ చేయాలని సినిమా టీంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మోహన్ లాల్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపడుతున్నారు.

Puneeth Rajkumar : పునీత్ కోసం అభిమాని ఆత్మహత్య.. కుటుంబాన్ని పరామర్శించిన పునీత్ సోదరుడు

ఇలాంటి సమయంలో ఆందోళనలను తగ్గించడానికి కేరళ సినిమాటోగ్రఫీ మంత్రి సాజి చెరియన్ ఓ ప్రకటన చేశారు. మోహన్ లాల్ నటించిన ‘మరక్కార్’ సినిమాను థియేటర్ల ద్వారా విడుదల చేయిస్తామని, ఆ సినిమా విడుదలకు కావాల్సిన అనుమతులు ఇస్తామని, థియేటర్లలో నూరు శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు ఇస్తామని తెలిపారు. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. అంతే కాక ఈ సినిమాకి పన్ను విషయంలో కూడా చర్చిస్తామని, ‘మరక్కార్’ సినిమా మలయాళ సినీ పరిశ్రమ స్థాయిని పెంచుతుందని, ఇలాంటి సినిమాను థియేటర్ల ద్వారా విడుదల చేసే విషయంలో తమ సహకారం ఉంటుందని మంత్రి తెలిపారు.

Mallika Sherawat : నడుము మీద చపాతీ వేడి చేస్తామన్నారు.. అందుకే రిజెక్ట్ చేశా

‘మరక్కార్’ సినిమాని డిసెంబర్ 2న దేశ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. అమెజాన్ ప్రైమ్ లో కూడా ఇదే డేట్ న రిలీజ్ చేస్తామని అంతకుముందు ప్రకటించారు. మరి ఓటిటి రిలీజ్ డేట్ మారుతుందా మారదో చూడాలి. ఇక ఈ సినిమా రిలీజ్ కి ముందే జాతీయ అవార్డులను కూడా దక్కించుకుంది.