Bigg Boss 5 : జెస్సికి మళ్ళీ ఆరోగ్య సమస్యలు.. ఉంచుతారా? పంపిస్తారా?

బిగ్ బాస్ లో జెస్సి కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. డాక్టర్స్ చెకప్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చారు. జెస్సి వర్టిగో అనే వ్యాధితో బాధపడుతున్నాడు. రెండు రోజుల క్రితం జెస్సి

Bigg Boss 5 : జెస్సికి మళ్ళీ ఆరోగ్య సమస్యలు.. ఉంచుతారా? పంపిస్తారా?

Jessi

Bigg Boss 5 :  బిగ్ బాస్ లో జెస్సి కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. డాక్టర్స్ చెకప్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చారు. జెస్సి వర్టిగో అనే వ్యాధితో బాధపడుతున్నాడు. రెండు రోజుల క్రితం జెస్సికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అంటూ హౌస్ నుంచి పంపించేస్తున్నాము అని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో అందరూ షాక్ అయి ఎమోషనల్ అయ్యారు. కానీ జెస్సిని సీక్రెట్ రూమ్ లో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు.

Bhagyasri : తల్లి ప్రభాస్ సినిమాలో.. కూతురు బెల్లంకొండ సినిమాలో

తాజాగా జెస్సి కెమెరాల‌తో త‌న బాధ చెప్పుకున్నాడు. సరిగా చూడలేకపోతున్నానని, ఒక వైపుకు నెట్టేసినట్లు పడిపోతున్నానని, పడుకున్నప్పుడు స్నేక్‌ ఉన్నట్లుగా అనిపిస్తుందని, నడవలేకపోతున్నాను అని బిగ్ బాస్ కి చెప్పాడు. దీంతో అతడిని చెకప్‌ చేసేందుకు డాక్టర్‌ రాగా.. జెస్సీ తన చేతులు లావైనట్లు అనిపిస్తోందని, ఇలా ఇంతకుముందు ఎప్పుడూ లేదని అన్నాడు. దీంతో జెస్సిని ట్రీట్ చేయడానికి వచ్చిన డాక్టర్ నీకు మెరుగైన వైద్యం అవసరం, అందుకు తగ్గట్టు మంచి ట్రీట్‌మెంట్‌ ఇస్తామని, ధైర్యంగా ఉండమని జెస్సీకి భరోసా ఇచ్చారు.

Vishnupriya : నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకోబోతున్న విష్ణుప్రియ?

జెస్సికి ఆరోగ్యం బాగోలేదని 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాల‌ని చెప్పారు. ప్ర‌స్తుత ప‌రిస్థితి చూస్తే ఇంట్లో ఉండే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. జెస్సి తన ఆరోగ్య సమస్యలతో చాలా బాధపడుతున్నాడు. మరి ఈ సారి నిజంగానే బయటకి పంపిస్తారా? లేదా ఇప్పటిలాగే సీక్రెట్ రూమ్ లో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తారా చూడాలి.